• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  ధ్రువ్ రాఠీకి గట్టి...

ధ్రువ్ రాఠీకి గట్టి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

| 2018 నాటి క్రిమినల్ పరువు నష్టం కేసులో యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై ఢిల్లీలోని సాకేత్ కోర్టు మరోసారి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పలుమార్లు సమన్లు, వారెంట్లు జారీ చేసినా ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 3, 2026కు వాయిదా వేసింది.

By - A.N.Kumar
Update: 2026-11-24 00:28 GMT

సామాజిక.. రాజకీయ అంశాలపై తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2018లో నమోదైన ఓ క్రిమినల్ పరువు నష్టం కేసులో ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆయనపై తాజాగా నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఏడేళ్ల నాటి ఈ పాత వివాదం మరోసారి తెరపైకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ న్యాయవివాదానికి 2018లో ధ్రువ్ రాఠీ రూపొందించిన బీజేపీ ఐటీ సెల్ పార్ట్ 2 అనే యూట్యూబ్ వీడియో ప్రధాన కారణం. బీజేపీకి మద్దతుగా వ్యవహరించే ఐ సపోర్ట్ నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ పేజీ వ్యవస్థాపకుడు వికాస్ పాండే ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో తనపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని పేర్కొంటూ వికాస్ పాండే 2018లో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఈ వీడియో వల్ల సమాజంలో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఈ కేసు విచారణలో భాగంగా ధ్రువ్ రాఠీ న్యాయస్థానం ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే సాకేత్ కోర్టు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనమ్ రయీస్ ఖాన్ ఈ కేసును విచారిస్తూ రాఠీ గైర్హాజరుపై తీవ్రంగా స్పందించారు. కేసు రికార్డుల ప్రకారం గతంలోనూ కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేయడంతో పాటు రెండుసార్లు నాన్-బెయిలబుల్ వారెంట్లు ఇచ్చింది. అయినప్పటికీ నిందితుడు విచారణకు హాజరుకాకపోవడం.. గత వారెంట్ల అమలులో సాంకేతిక ఇబ్బందులు ఎదురుకావడంతో న్యాయస్థానం తాజాగా మరోసారి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ప్రస్తుతం జర్మనీలో నివసిస్తున్న ధ్రువ్ రాఠీకి ఈ వారెంట్‌ను ఏ విధంగా అమలు చేస్తారన్నది న్యాయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు 2026 డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

ఇటీవల జరిగిన ఓ నిరసన కార్యక్రమం నేపథ్యంలోనూ ధ్రువ్ రాఠీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్నికల సంఘం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆందోళనలు చేపట్టింది. ఇందులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన రాఠీ అక్టోబర్ 8న బెంగళూరులో జరిగిన నిరసనలో పాల్గొన్నారు.

అనంతరం అక్టోబర్ 10న ఢిల్లీలో జరగాల్సిన 'జంతర్ మంతర్ 2.0' నిరసనకు ముందు గురుగ్రామ్‌లోని ఆయన నివాసం నుంచి ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని.. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విడుదల చేశారు. అయితే ఈ ఘటనపై ధ్రువ్ రాఠీ తీవ్ర ఆరోపణలు చేశారు. అది అరెస్ట్ కాదని.. తనను కిడ్నాప్ చేశారని ఆయన పేర్కొన్నారు. సాధారణ దుస్తుల్లో వచ్చిన సుమారు 20 మంది వ్యక్తులు ఉదయం 7 గంటలకు తన ఇంట్లోకి ప్రవేశించి.. తాను నిద్రపోతుండగానే బలవంతంగా తీసుకెళ్లారని రాఠీ ఆరోపించారు. సుమారు 20 గంటలకు పైగా తన ఫోన్ వాడుకోనివ్వలేదని.. కనీసం న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పలు పోలీస్ స్టేషన్లకు తిప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

డిసెంబర్ 3న జరగనున్న తదుపరి విచారణలో ధ్రువ్ రాఠీ తరఫు న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపిస్తారు? కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ధ్రువ్ రాఠీ ప్రస్తుతం భారత్ వచ్చే సూచనలు లేవు. సో ఆయన లాయర్ల ద్వారా అప్రోచ్ అవుతారా? లేదా? అన్నది చూడాలి.

Tags:    
  • dhruvrathee 
  • delhicourt 
  • nonbailablewarrant 
  • defamationcase 
  • vikaspandey 

Similar News

రియ‌ల్ ఎస్టేట్ లో భూకంపం.. బ్యాంకులు-బిల్డ‌ర్ల మిలాఖ‌త్‌: సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

2026-11-23 02:37 GMT

నా ఇంట్లోకి ష‌ర్మిల‌ను అడుగు పెట్ట‌నివ్వ‌ద్దు: కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్‌

2026-11-22 00:00 GMT

మేనరికం పెళ్లిళ్లు.. మనకు ఎన్నాళ్లీ బాధ?

2026-11-21 17:04 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

కోర్టు నిర్ధోషి అని తేల్చేసినా 7ఏళ్లు జైల్లోనే మ‌గ్గాడు.. ఈ న‌ర‌కానికి ప‌రిహారం 30ల‌క్ష‌లు!

2026-11-17 04:07 GMT

సెకండ్స్‌లో డ‌మ్మీ ఐఫోన్ అమ్మిన షాప్‌కి వినియోగ‌దారుల క‌మిష‌న్ ఝ‌ల‌క్!

2026-11-16 04:22 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!

2026-11-10 12:51 GMT

అరెస్ట్ అయితే చాలు.. ఇక 'ఉద్యోగానికి' సెలవు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పుతో అవినీతి తిమింగలాలకు వణుకు

2026-11-10 06:00 GMT

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

2026-11-07 13:45 GMT

Copyright @2026

Powered by Blink CMS