• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  మేనరికం పెళ్లిళ్లు.. మనకు...

మేనరికం పెళ్లిళ్లు.. మనకు ఎన్నాళ్లీ బాధ?

| మేనరికం వివాహాల వల్ల పిల్లలకు జన్యుపరమైన సమస్యలు వచ్చే ప్రమాదంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 20 ఏళ్ల న్యాయ విద్యార్థిని చార్వి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జన్యుపరమైన సమస్యలపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని సూచించింది.

By - A.N.Kumar
Update: 2026-11-21 17:04 GMT

మన ఇంట్లో ఆడపిల్ల మన కళ్లముందే ఉండాలనో.. ఆస్తులు పరాయి ఇంటికి వెళ్లకూడదనో.. లేక తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని గౌరవించాలనో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు.. రేపటి తరం పిల్లల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయంటే నమ్మగలరా? అవును.. రక్త సంబంధీకుల మధ్య జరిగే మేనరికం వివాహాలు ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక భావోద్వేగపూరితమైన కీలకమైన చర్చకు దారితీశాయి.

ఈ చర్చకు కారణం 20 ఏళ్ల న్యాయ విద్యార్థిని చార్వి. పుట్టుకతోనే 40 శాతం దృష్టి లోపంతో బాధపడుతున్న ఆ యువతి.. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే తపనతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆచారాల పేరుతో హిందూ వివాహ చట్టంలో ఉన్న మినహాయింపుల వల్ల మేనరికం పెళ్లిళ్లు యథేచ్ఛగా జరుగుతున్నాయని.. దీనివల్ల ఎంతోమంది చిన్నారులు జన్యుపరమైన లోపాలతో నరకం అనుభవిస్తున్నారని ఆమె తన పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దగ్గరి రక్త సంబంధీకుల మధ్య వివాహాల వల్ల పుట్టబోయే పిల్లలకు వినికిడి.. చూపు సమస్యలు.. ఇతర జన్యుపరమైన వ్యాధులు వచ్చే ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 23 నుంచి 28 శాతం వరకు ఇలాంటి వివాహాలే జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.

వివాహ ఆచారాలను నియంత్రించే అధికారం పార్లమెంటుకు ఉందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అయితే కేవలం కఠిన చట్టాలు చేయడం వల్ల సమాజంలో మార్పు రాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలంటే పాఠశాల.. కళాశాల స్థాయి నుంచే జన్యుపరమైన సమస్యలపై పాఠ్యాంశాలను చేర్చాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలు.. పంచాయతీల ద్వారా ప్రతి ఇంటికీ ఈ శాస్త్రీయ సత్యాన్ని చేరవేయాలని పేర్కొంది.

జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛే కావచ్చు. కానీ ఆ నిర్ణయం రేపు ఈ భూమిపైకి రాబోయే ఒక పసిపాప ఆరోగ్యాన్ని పణంగా పెట్టేదిగా ఉండకూడదు. పెద్దల మాటకో.. ఆస్తుల కోసమో కాకుండా.. విజ్ఞానంతో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. సంప్రదాయాలను గౌరవిస్తూనే.. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడే మనం భావితరాలకు ఒక ఆరోగ్యకరమైన, అందమైన జీవితాన్ని కానుకగా ఇవ్వగలం..

Tags:    
  • supremecourt 
  • consanguineousmarriage 
  • cousinmarriage 
  • geneticdisorders 

Similar News

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

కోర్టు నిర్ధోషి అని తేల్చేసినా 7ఏళ్లు జైల్లోనే మ‌గ్గాడు.. ఈ న‌ర‌కానికి ప‌రిహారం 30ల‌క్ష‌లు!

2026-11-17 04:07 GMT

సెకండ్స్‌లో డ‌మ్మీ ఐఫోన్ అమ్మిన షాప్‌కి వినియోగ‌దారుల క‌మిష‌న్ ఝ‌ల‌క్!

2026-11-16 04:22 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!

2026-11-10 12:51 GMT

అరెస్ట్ అయితే చాలు.. ఇక 'ఉద్యోగానికి' సెలవు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పుతో అవినీతి తిమింగలాలకు వణుకు

2026-11-10 06:00 GMT

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

2026-11-07 13:45 GMT

భర్త మహాశయులారా? భార్యకు భరణం ఎగ్గొట్టే ప్లాన్ చేయకండి.. ఇలా బుక్కవుతారు..

2026-11-07 02:19 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

Copyright @2026

Powered by Blink CMS