• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు...

ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి.. జగన్ ట్వీట్

| ప్రస్తుతం ఆ:ద్రప్రదేశ్ కు అపధ్దర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-06-08 04:03 GMT

ప్రస్తుతం ఆ:ద్రప్రదేశ్ కు అపధ్దర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఆయన తన సోషల్ పోస్టు ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని.. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వచ్చినట్లుగా ఆయన పోస్టు చేశారు. ఎన్నికల్లో విజయం తర్వాత తెలుగుదేశం పార్టీ వర్గాలు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారని.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆటవిక పరిస్థితులు తలెత్తినట్లుగా పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపైన దాడులు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా చెప్పిన ఆయన.. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దాడులకు జరిగిన ప్రాంతాలకు వెళ్లి కార్యకర్తలకు భరోసా కల్పించేలా జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అదే సమయంలో రాష్ట్ర గవర్నర్ ఈ దాడులపై స్పందించాలని.. జోక్యం చేసుకోవాలని కోరారు.

అయితే.. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పోస్టు చేసిన వైఎస్ జగన్.. తనకు తానుగా బయటకు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడితే మరింత బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దాడులపై గవర్నర్ తక్షణమే జోక్ం చేసుకోవాలని జగన్ కోరారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు పలువురిని గవర్నర్ వద్దకు పంపారు. తాజాగా ఏపీలోని పరిస్థితి గురించి వివరిస్తూ..తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి మరీ దాడులకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు.

ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని.. టీడీపీ వర్గాలు ఉన్మాదంగా వైసీపీ వర్గాల మీద దాడులకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఉన్నత చదువులకు కేంద్రాలైనా వర్సిటీల్లో ఆచార్యులపైనా దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

గడిచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు.. పేదలను ఆదుకునే ప్రోగ్రాంలో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటిని కేవలం మూడు రోజుల్లోనే దారుణంగా దెబ్బ తీస్తున్నారని మండిపడుతున్నారు. హింసాయుతంగా పరిస్థితుల్ని మార్చి ప్రజాస్వామ్యానికి.. పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతున్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై గవర్నర్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు.…

— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2024
Tags:    
  • Jaganmohanreddy 
  • Ysrcp 
  • APelections 
  • Police 
  • Tdp 
  • Chandrababunaidu 
  • Janasena 
  • Pawankalyan 
  • Bjp 

Similar News

త్రిష మరో జయలలిత...పోలిక బాగానే ఉంది కానీ ?

2026-11-24 03:46 GMT

కార్తీక పౌర్ణమి....365 ఒత్తుల ఆధ్యాత్మిక సందేశం

2026-11-24 03:46 GMT

జనసేన బలపడినట్లేనా ?

2026-11-24 03:45 GMT

మేయర్లు చైర్మన్లు రేపటి పోటీదారులు !

2026-11-24 02:30 GMT

ఇలాగైతే ఎలా సారూ...కేసీఆర్ ది వ్యూహమా ?

2026-11-24 01:30 GMT

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? చిన్న నిర్లక్ష్యంతో మీ పని గోవిందా.. కేంద్రం కీలక హెచ్చరిక

2026-11-24 00:56 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

బీజేపీ పాల‌న‌.. ఏకంగా రాష్ట్రం పేరు మార్చేశారు.. రీజ‌న్‌ తెలిస్తే.. అవాక్కే!

2026-11-24 00:50 GMT

ప్రపంచానికి బట్టలు కుట్టించి.. తన పరువు మాత్రం బజారున పడేసుకున్న బంగ్లాదేశ్

2026-11-24 00:36 GMT

ధ్రువ్ రాఠీకి గట్టి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

2026-11-24 00:28 GMT

Copyright @2026

Powered by Blink CMS