• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ టూర్ లో బొత్స మిస్ ?

జగన్ టూర్ లో బొత్స మిస్ ?

| మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటన చేశారు. ఆయన చాలా కాలం తరువాత జిల్లాకు వచ్చారు.

By - Tupaki Desk
Update: 2024-10-25 03:55 GMT

మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటన చేశారు. ఆయన చాలా కాలం తరువాత జిల్లాకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మొదట్లో జిల్లాకు వచ్చిన జగన్ ఇపుడు 2024 ముగుస్తున్న నేపధ్యంలో మరోసారి వచ్చారు. గుర్ల మండలంలో అతిసార వ్యాధితో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడానికి జగన్ ఈ టూర్ పెట్టుకున్నారు.

జగన్ జిల్లా పర్యటనకు వచ్చినపుడు ఆయన వెంట జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ మజ్జి శ్రీనివాసరావు తో పాటు ఇతర నాయకులు ఉన్నారు. అయితే జిల్లాకే పెద్ద దిక్కు శాసనమండలిలో విపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ మాత్రం కనిపించకపోవడం గమనార్హం అని అంటున్నారు.

జగన్ తన సొంత జిల్లాకు వస్తే బొత్స ఎందుకు పక్కన లేరు అన్నదే అంతా చర్చించుకుంటున్నారు. బొత్స ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇచ్చారు. ఆ తరువాత కేబినేట్ ర్యాంక్ హోదా కలిగిన మండలి అపొజిషన్ లీడర్ గా కూడా చాన్స్ ఇచ్చారు.

బొత్స కూడా తరచూ మీడియా సమావేశాలు పెడుతూ టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక బొత్సను జగన్ ఉభయగోదావరి జిల్లాలకు రీజనల్ కో ఆర్డినేటర్ గా కూడా నియమించారు. మరి జగన్ టూర్ లో ఆయన ఎందుకు లేరు అన్నదే చర్చకు వస్తోంది.

ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని నియమించడం పట్ల బొత్స అసంతృప్తిగా ఉన్నారు అని అంటున్నారు. అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ జగన్ టూర్ లో ఎక్కడా బొత్స కనిపించలేదు. అంతే కాదు జగన్ విశాఖ పర్యటనలో సైతం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు కానీ అక్కడ కూడా బొత్స కనిపించకపోవడం పట్ల చర్చ అయితే సాగుతోంది. దాంతో అసలు వైసీపీలో ఏమి జరుగుతోంది అన్నది కూడా పెద్ద చర్చగానే ఉందిపుడు.

బలమైన సామాజిక వర్గానికి చెందిన బొత్స ఉత్తరాంధ్రా జిల్లాలలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనది మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం. ఆయనను అందుకే జగన్ వైసీపీలో గౌరవించి అయిదేళ్ల పాటు మంత్రిగా ఉండేలా చూశారు. పార్టీ ఒడింది, ఎందరో నాయకులకు పదవులు లేకుండా పోయాయి. కానీ బొత్సకు మాత్రం ఎమ్మెల్సీ రూపంలో పదవి దక్కింది. మరి బొత్సకు పార్టీకి మధ్య ఏదైనా గ్యాప్ ఉందా అన్నదే కూడా అంతా అనుకుంటున్నారు. ఏది ఏమైనా అధినేత జిల్లాకు వచ్చినపుడు బొత్స మిస్ కావడం మాత్రం హాట్ టాపిక్ గా ఉంది అని అంటున్నారు.

Tags:    
  • Botsasatyanarayana 
  • Jagan 
  • Appolitics 
  • YSRCP 
  • Vijayasaireddy 
  • Apgovernment 
  • Vizianagaramdistrict 

Similar News

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS