జ‌గ‌న్ మాట‌: నాపైనా రౌడీ షీట్ పెడ‌తారు!

ఎన్ని కేసులు పెట్టినా.. ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ చెప్పారు. త‌న‌పై అనేక కేసులు పెట్టార‌ని.. జైల్లో కూడా ఉంచార‌ని.. అయినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాలేదా? అని ప్ర‌శ్నించారు.

Update: 2026-09-24 04:00 GMT

తాజాగా ఏపీ ప్ర‌భుత్వం వైసీపీకి చెందిన 51 మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై రౌడీషీట్లు తెర‌వాల‌ని పోలీసుల‌ను ఆదేశించిన వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌లనంగా మారింది. దీంతో వైసీపీనాయ‌కులు ఇక నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు వంటి కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటార‌ని తెలుస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా విశాఖ‌ప‌ట్నం వైసీపీనాయ‌కుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

``రౌడీషీట్లు పెట్టాల‌ని చంద్ర‌బాబు ఆదేశించాడంట‌. పెట్టుకోమ‌న‌బ్బా. మీపైనే కాదు.. నా పైన కూడా రౌడీ షీటు పెట్టాల‌ని చూస్తున్నారు. ఇలాంటి వ‌చ్చిన‌ప్పుడే.. మ‌నం మ‌రింత రాటు తేలాలి. మ‌నోళ్లు ఏం త‌ప్పు చేశారు. డీఎస్సీలో అన్యాయం జ‌రిగింది.. విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరాం. ఇది త‌ప్పా..`` అని ప్ర‌శ్నించారు. కానీ.. ప్ర‌భుత్వం మాత్రం రౌడీ షీట్లు పెట్టి బెదిరించాల‌ని చూస్తోంద‌ని వ్యాఖ్యానించారు. వీటికి ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఎన్ని కేసులు పెట్టినా.. ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ చెప్పారు. త‌న‌పై అనేక కేసులు పెట్టార‌ని.. జైల్లో కూడా ఉంచార‌ని.. అయినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాలేదా? అని ప్ర‌శ్నించారు. కేసులు పెట్టార‌నో.. పోలీసులు తిట్టార‌నో కూర్చుంటే నాయ‌కులు కాలేరు.. అని దిశానిర్దేశం చేశారు. ఎన్ని ఎక్కువ కేసులు నమోదైతే.. అంత‌గా మీరు బాగా ప‌నిచేస్తున్నార‌ని అర్థం .. అంటూ త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. కేసుల‌కు భ‌య‌ప‌డే వారు నాయ‌కులు కాలేర‌ని.. చంద్ర‌బాబు చేస్తున్న దానికి రెండింత‌లు వారి పార్టీ అనుభ‌విస్తుంద‌ని చెప్పారు.

ప్ర‌జ‌లు మ‌న‌తోనే..

ప్ర‌జ‌లు వైసీపీతోనే ఉన్నార‌ని.. జ‌గ‌న్ చెప్పారు. ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. ప్ర‌జ‌లు వ‌స్తున్నార‌ని చెప్పారు. ప్ర‌జ‌ల కోసం.. మ‌నం పార్టీ పెట్టామ‌ని.. ఎవ‌రో ఏదో భ‌య‌పెట్టార‌నో.. కేసులు పెట్టార‌నో మీరు ఆలోచించ‌వ‌ద్ద‌న్నారు. కేసులు పెట్టారంటే అది వారి చేత‌కాని త‌నానికి నిద‌ర్శ‌నం. రౌడీషీట్ల వ్య‌వ‌హారంపై హైకోర్టులో పిటిష‌న్ వేస్తున్నామ‌ని చెప్పారు. కోర్టులు ఏం చెబుతాయో చూద్దామ‌ని వ్యాఖ్యానించారు. అయితే.. నాయ‌కులు ఈ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ప‌డ్డారు. రౌడీ షీట్ పెడితే.. రేపు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అన‌ర్హుల‌వుతార‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. అలాంటి దేమీ ఉండ‌ద‌ని.. అదంతా త‌న‌కు వ‌దిలేయాల‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News