'ఆ నేపథ్యంలో చేసినారేమో'.. షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై జగన్ వ్యాఖ్యలు!
ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ విషయం తెరపైకి వచ్చింది.;
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, అధికారులు, సినీ ప్రముఖులు మొదలైన వారి ఫోన్లు ట్యాప్ చేశారనే విషయం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ విషయం తెరపైకి వచ్చింది.
దీనిపై స్పందించిన షర్మిల... తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమని అన్నారు. తన ఫోన్ తో పాటు తన భర్త, దగ్గర వాళ్ల ఫోన్లను ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు.
ఈ సందర్భంగా... రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని షర్మిల కోరారు. అనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి.. రక్త సంబంధం కూడా చిన్నబోయిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో... ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు.
అవును... తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని వైఎస్ షర్మిల అన్నారు. దీనిపై తాజాగా స్పందించిన జగన్... వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేశారో.. లేదో.. తనకు తెలియదని అన్నారు.
ఇదే సమయంలో... “గతంలో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల క్రియాశీలకంగా, పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినారేమో.. చేశారో లేదో నాకేం తెలుసు”.. అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా.. అసలు తెలంగాణ వ్యవహారంతో తనకు సంబంధం లేదని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.