• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ క్రెడిట్ దళపతి విజయ్...

ఆ క్రెడిట్ దళపతి విజయ్ కే.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

| దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అవడంపై మాజీ సీఎం జగన్ స్పందన వైరల్ అవుతోంది.

By - Tupaki Political Desk
Update: 2026-05-21 13:14 GMT

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయంలో తన పాత్రపై ఏపీ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఫొటో ప్రదర్శించారని, విజయ్ పార్టీ గెలుపునకు అది కూడా ఒక కారణమని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జగన్ తొలిసారిగా స్పందించారు. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ కే పలుకుబడి ఉంటుందని, అక్కడ జగన్ తో పనేం ఉంటుందని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అవడంపై మాజీ సీఎం జగన్ స్పందన వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో జగన్ తో విజయ్ కలిసిన ఫొటోను ఓ అభిమాని ఇవ్వగా, దానిని విజయ్ బహిరంగ సభలో ప్రదర్శించారు. అంతకు ముందు జగన్ సమీప బంధువుల వివాహంలో కూడా ఇద్దరు కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో విజయ్-జగన్ మధ్య సాన్నిహిత్యంపై విస్తృత ప్రచారం సాగిందని అంటున్నారు. ఎన్నికల అనంతరం జగన్ అభిమానులు అంతా విజయ్ కు బాసటగా నిలబడటం కూడా ఆయనకు అడ్వాంటేజ్ అయిందని వైసీపీ శ్రేణులు ప్రచారం చేశాయి.

దీనిపై సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు చర్చలు జరగగా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రం తొలిసారిగా స్పందించారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదల సమయంలో జగన్ లండన్ లో ఉన్నారు. ఈ నెల 10న ఆయన తిరిగి స్వదేశానికి వచ్చారు. గురువారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలోనే విజయ్ గెలుపుపై జగన్మోనరెడ్డి స్పందన ఆసక్తి రేపింది.

తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ మీ ఫొటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారని, ఆ ప్రచారం ఆయనకు బాగా కలిసి వచ్చిందని చాలా మంది అంటున్నారని, దీనిపై మీ స్పందన ఏంటి అని విలేకరులు ప్రశ్నించగా, ఆయన రాష్ట్రంలో ఆయనకే ఎక్కువ పలుకుబడి ఉంటుంది. కానీ, జగన్ కు ఎలా ఉంటుందయ్యా? అంటూ నవ్వుతూ జగన్ చమత్కరించారు. దీంతో తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన క్రెడిట్ పూర్తిగా విజయ్ కే ఇచ్చేశారని, అందులో వాటా కోసం జగన్ ప్రయత్నించలేదని అంటున్నారు.

జగన్ ఫస్ట్ టైం..

కాగా, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి మీడియా సమావేశం ఈ సారి కాస్త డిఫరెంటుగా జరిగిందని అంటున్నారు. విపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహనరెడ్డి తరచూ మీడియాతో మాట్లాడుతున్నా, ఈ సారి కాస్త భిన్నంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు జగన్ మీడియా సమావేశం అంటే ఆయన మాట్లాడింది మాత్రమే మీడియా ప్రసారం చేసేదని చెబుతున్నారు. దీంతో జగన్ మీడియా సమావేశాలు రికార్డెడ్ ప్రొగ్రామ్ అంటూ ప్రత్యర్థులు విమర్శలు చేసేవారు. జగన్ మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఎప్పుడూ మీడియాను చూపేవారు కాదని అంటున్నారు. కానీ, ఈ సారి జగన్ విలేఖరుల ప్రశ్నలను ఎదుర్కోవడం, వాటికి సమాధానాలు చెప్పడం కొంతవరకు చర్చకు దారితీసిందని చెబుతున్నారు.

Tags:    
  • jagan 
  • vijay 
  • tamilnaduelections 
  • tvk 
  • apnews 
  • appolitics 

Similar News

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

Copyright @2026

Powered by Blink CMS