• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యుద్ధ విమానాల్లో 'మెగా'...

యుద్ధ విమానాల్లో 'మెగా' స్టార్... ఈ బాంబర్ గురించి తెలుసా?

| అవును... అమెరికా బాంబర్ విమానం 'బి-2 స్పిరిట్‌' గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

By - Tupaki Desk
Update: 2025-06-24 16:56 GMT

ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత.. టెహ్రాన్ లోని ఫోర్డో అణుకేంద్రం గురించిన చర్చ విపరీతంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇది భూ ఉపరితలానికి సుమారు వంద మీటర్లకు పైగా లోతులో, అత్యంత కట్టుదిట్టంగా చేయబడిన నిర్మాణమని కథనాలొచ్చాయి. దీన్ని ధ్వంసం చేయాలంటే అందుకు తగిన ఆయుధం బంకర్ బ్లస్టర్ బాంబు అని.. అది అమెరికా వద్ద మాత్రమే ఉందనే చర్చ నడిచింది.

అన్నట్లుగానే ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా సుమారు 14 బంకర్ బ్లస్టర్ బాంబులను ఇరాన్ లోని అణుకేంద్రాలపై జారవిడిచింది. దీంతో.. అవన్నీ ధ్వంసమయ్యాయని తెలిపింది. ఇంత భారీ బాంబులను మోసుకొచ్చి, సరిగ్గా దాడి చేసిన బాంబర్ విమానం గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అదే 'బీ-2 స్పిరిట్ బాంబర్' విమానం.

అవును... అమెరికా బాంబర్ విమానం 'బి-2 స్పిరిట్‌' గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికా సుదీర్ఘ దూరాల్లో కఠినమైన ఆపరేషన్లు చేయాలనుకొన్నప్పుడల్లా ఈ విమానాన్ని రంగంలోకి దించుతుంది. ఇది కొన్ని రోజుల పాటు సుదీర్ఘ సమయం గాల్లో ప్రయాణించి.. విజయవంతంగా పని పూర్తి చేసి తిరిగి రాగలదు. దీన్ని ఐదోతరం బాంబర్‌ గా పరిగణిస్తారు.

అగ్రరాజ్యం చేపట్టిన ఏ ఆపరేషన్ లో అయినా మొదటి రోజు రాత్రి ప్రత్యర్థి గగనతలంలోకి వెళ్లి సందడి చేసేది ఈ విమానమే. ఇందులో భాగంగా... అఫ్గానిస్థాన్‌ పై చేపట్టిన 'ఆపరేషన్‌ ఎండ్యూరింగ్‌ ఫ్రీడం' అయినా.. సెర్బియాపై ప్రారంబించిన 'ఆపరేషన్‌ అలైడ్‌ ఫోర్సెస్‌' అయినా.. ఇరాక్‌ పై విరుచుకుపడిన 'ఆపరేషన్‌ ఇరాక్‌ ఫ్రీడమ్‌' అయినా ఇదే సపోర్టింగ్‌ ఆపరేషన్లు చేసింది.

ఇదే క్రమంలో... లిబియాపై చేపట్టిన 'ఆపరేషన్‌ ఒడెస్సీ డాన్‌' అయినా.. తాజాగా ఇరాన్ పై చేపట్టిన 'ఆపరేషన్ మిడ్ నైట్ హార్మర్' అయినా.. వాటి విజయాలు దీనిపనే. ప్రపంచంలో ఏ యుద్ధ రంగంలోనైనా అన్నిరకాల పరిస్థితులను తట్టుకొని నిలిచిన బాంబర్‌ విమానంగా దీనికి పేరుంది.

ఇదే సమయంలో... కొసావోలో అమెరికా చేపట్టిన 'ఆపరేషన్‌ అలైడ్‌ ఫోర్స్‌' కోసం తొలిరోజు రాత్రి అమెరికాలోని మిస్సోరి సమీపంలో ఉన్న వైట్‌ మన్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి రెండు బి-2 స్పిరిట్‌ లు బయలుదేరి ఏకంగా 31 గంటలు ఏకధాటిగా ప్రయాణించాయి. అనంతరం కొసావో చేరుకొని.. దాడులు చేశాయి. దీంతో... దీని సామర్థ్యం చూసి ప్రపంచం నివ్వెరపోయింది.

అనంతరం... 2001లో ది స్పిరిట్‌ ఆఫ్‌ అమెరికా కోసం ఐదు బి-2 బాంబర్లు కలిసి అఫ్గానిస్థాన్‌ గగనతలంలోకి చొరబడి బాంబుదాడులు చేశాయి. దీనికోసం 44 గంటలు ప్రయాణించాయి. తాజాగా ఇరాన్ పైన చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ కోసం ఏడు బీ-2 బాంబర్లు 34 గంటలు ప్రయాణించాయి. మార్గమధ్యలో గాల్లోనే ఇంధనం నింపుకుంటూ అవిరామంగా ప్రయాణించి పని పూర్తి చేశాయి! అందుకే దీన్ని యుద్ధ విమానాల్లో మెగా స్టార్ అనొచ్చని అంటున్నారు!

Tags:    
  • IranIsraelWar 
  • B2Bomber 
  • USAirForce 
  • FordoNuclearSite 
  • StealthBomber 
  • BunkerBuster 
  • OperationMidnightHammer 
  • MilitaryNews 
  • GlobalConflict 
  • DefenseTech 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS