పాకిస్థాన్ కు గూఢచర్యం.. ఎవరీ యూట్యూబర్ జ్యోతి?

ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం జరిగినప్పటికీ.. అంతర్గతంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-05-17 12:21 GMT


Full View

ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం జరిగినప్పటికీ.. అంతర్గతంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. పాకిస్థాన్ నిఘా సంస్థలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఓ యూట్యూబర్ ని అరెస్ట్ చేశారు! దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... పాకిస్థాన్ కు సున్నితమైన సమాచారన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ఓ ట్రావెల్ బ్లాగర్ సహా ఆరుగురు భారతీయులను అరెస్ట్ చేశారు! ఈ నెట్ వర్క్ హర్యానాతో పాటు పంజాబ్ అంతటా విస్తరించి ఉందని.. ఇందులో పలువురు ఈ వ్యవహారాన్ని ఆర్థిక మార్గంగా భావించి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

నిందితుల్లో ఓ యూట్యూబ్ ఛానల్ నడిపిన జ్యోతి మల్హోత్రా ఉన్నారని.. కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన తర్వాత 2023లో ఆమె పాకిస్థాన్ ను సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు! ఈ సమయంలో.. ఆమె న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ లోని ఈహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్ తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నట్లు చెబుతున్నారు.

అతనితో ఇటీవల ఇండోనేషియాలోని బాలికి వెళ్లిందని చెబుతున్నారు. ఈ క్రమంలో డానిష్ ద్వారా ఆమెకు పాకిస్థాన్ నిఘా సంస్థకు చెందిన ఇతర ఏజెంట్లతో పరిచయం ఏర్పడింది. వీరిలో అలీ అహ్సాన్, షకీర్ అలియాస్ రాణా షాబాజ్ ఉన్నారు! ఈ క్రమంలో.. డానిష్ ని ఈ నెల 13న 'పర్సొనా నాన్ గ్రాటా'గా ప్రకటించింది భారత ప్రభుత్వం.

దీంతో.. సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ పట్ల సానుకూల ఇమేజ్ ప్రదర్శించే బాధ్యత జ్యోతికి ఇవ్వబడిందని చెబుతున్నారు. దానిని భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం, గూఢచర్య కార్యకలాపాలకు పాకిస్థాన్ దానిని ఉపయోగిస్తోంది! ఈ మొత్తం విషయంలో జ్యోతితో సహా ఆరుగురు భారతీయ పౌరులు పాల్గొన్నట్లు గుర్తించారని అంటున్నారు.

దీంతో... జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్) సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాలు మోపబడ్డాయని తెలుస్తోంది. దీనిపై స్పందించిన అధికారులు.. ఈ కేసు ఓ పెద్ద గూఢచర్య ఆపరేషన్ లో భాగమని పేర్కొన్నారు! నిందితులు ఇందులో తమ ప్రమేయాన్ని అంగీకరించారని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.


Tags:    

Similar News