ఇండియాతో ఈజీ... అమెరికా ఆసక్తికర వ్యాఖ్యలు!

భారత్ మాత్రం అలాంటి ఆలోచన చేయకుండా.. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేసింది.;

Update: 2025-04-30 08:23 GMT

భారత్ పై అగ్రరాజ్యం అమెరికా సుమారు 26శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఈ ఒప్పందం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అన్నారు.

అవును... ఈ నెల ప్రారంభంలో పలు దేశాలపై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇందులో 200 శాతం సుంకాల సౌండ్స్ కూడా వినిపించాయి. అయితే.. 90 రోజుల పాటు ఈ సుంకాల అమలుకు అగ్రరాజ్యం విరామం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యలపై ఘాటుగా స్పందించిన పలు దేశాలు.. ప్రతీకార చర్యలకు దిగాయి.

అయితే... భారత్ మాత్రం అలాంటి ఆలోచన చేయకుండా.. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా... ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్నికి అడుగులు పడ్డాయి. ఈ నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే స్పందించిన ట్రంప్... భారత్ తో సుంకాలపై చర్చలు గొప్పగా సాగుతున్నాయని.. మోడీ ఇటీవల అమెరికా వచ్చినప్పుడు సుంకాలపై ఒక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పందిస్తూ... ఇరుదేశాల మధ్య టారిఫ్ చర్చల్లో పురోగతి కనిపిస్తోందని అన్నారు.

దీనిపై త్వరలో న్యూఢిల్లీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే... ఇండియా వంటి సానుకూలమైన దేశాలతో చర్చలు జరపడం సులభమని స్పష్టం చేశారు.

Tags:    

Similar News