• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాకిస్థాన్ కు మరో రెండు...

పాకిస్థాన్ కు మరో రెండు షాకులు సిద్ధం చేస్తున్న భారత్!

| పహల్గాం దాడి అనంతరం భారత్ – పాక్ మధ్య తీవ్ర పరిణామాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-04-29 10:30 GMT

పహల్గాం దాడి అనంతరం భారత్ – పాక్ మధ్య తీవ్ర పరిణామాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే దౌత్యపరంగా భారత్ పలు షాకులు ఇవ్వగా.. ఇస్లామాబాద్ తన గగనతలాన్ని న్యూఢిల్లీ కోసం నో ఫ్లై జోన్ గా మార్చింది. ఈ సమయంలో పాకిస్థాన్ కు మరో రెండు షాకులు సిద్ధం చేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ తన గగనతలాన్ని భారత్ విమానల కోసం మూసేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... దానికి ప్రతిచర్యగా పాకిస్థాన్ విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని మూసివేయాలని.. ఇదే సమయంలో.. పాక్ నౌకలు భారత్ పోర్టుల్లోకి వచ్చేందుకు నిషేధం విధించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా భారత్ తన గగనతలంలో పాకిస్థాన్ విమానాలకు నిషేదం విధించడం వల్ల ఆ దేశ విమానయాన సంస్థలు తమ విమానాలను చైనా లేదా శ్రీలంక మీదుగా కౌలాలంపూర్, సింగపూర్, థాయిలాండ్ వంటి ఆగ్నేయాసియా గమ్యస్థానాలకు చేరుకోవడానికి దారి మళ్లించాల్సి వస్తుంది. ఫలితంగా విమానాలు ఎక్కువదూరం ప్రయాణించాల్సి వస్తుంది.

అందువల్ల భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే.. పాకిస్థాన్ విమానయానసంస్థపై గణనీయమైన ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

మరోపక్క పహల్గాం ఉగ్రదాడి అనంతరం తమపై భారత్ వైమానిక దాడులు చేయొచ్చని పాకిస్థాన్ భయపడుతోంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా.. నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ సమయంలో సియాల్ కోట్ ప్రాంతానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు కథనాలొస్తున్నాయి.

వీటి ప్రకారం... ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబీ) కు 58 కి.మీ దురంలో ఉన్న ఖోర్ కంటోన్ మెంట్ వద్ద టీపీఎస్-77 రాడార్ సైట్ ను ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు, ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇది అత్యంత సామర్థ్యం గల రాడార్ వ్యవస్థ.

Tags:    
  • IndiaPakistanTensions 
  • PahalgamAttack 
  • IndiaAirspaceBan 
  • PakistanAviationCrisis 
  • GeoPolitics 
  • IndiaDefense 
  • PakistanRadar 
  • NoFlyZone 
  • IndoPak 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS