వణికిపోతున్న పాక్.. భారత్ భయంతో షాబాజ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

దీంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి భారత్ పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలించింది.;

Update: 2025-04-29 07:30 GMT

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ దాడి తర్వాత భయంతో వణికిపోని పాక్ నేత, ఆ దేశంలోని ప్రాంతం దాదాపు లేకపోవచ్చు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ ప్రతిజ్ఞ చేసింది. దీంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి భారత్ పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలించింది.

దీంతో పాటు పాకిస్తానీయులను దేశం నుంచి బహిష్కరించడం, శత్రు దేశానికి చెందిన యూట్యూబ్ ఛానెళ్లను బ్యాన్ చేయడం వంటి అనేక ఇతర చర్యలతో కూడా భారత్ పాక్ ను చావుదెబ్బకొట్టింది. ఎక్స్‌ప్రెస్ న్యూస్ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ నేషనల్ సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (NCERT) దక్షిణ, మధ్య ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలను గుర్తు చేస్తూ ప్రభుత్వం, కీలక మౌలిక్ సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడుల ముప్పు పెరుగుతోందని హెచ్చరించింది.

భారత్ ఈసారి తమను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని పాకిస్తాన్ భయపడుతోంది. అన్ని వైపుల నుంచి భారత్ తమపై దాడి చేస్తుందనే భయం కూడా వారిని వెంటాడుతోంది. సోమవారం ప్రభుత్వం ఒక సలహా నోటీసు జారీ చేసింది. హ్యాకర్లు పాకిస్తాన్‌పై సైబర్ దాడులు ప్రారంభించడానికి ప్రస్తుత ప్రాంతీయ అస్థిరత్వాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందంటూ హెచ్చరించింది.

ఈ రంగాలకు భయం!

సైబర్ దాడులు రక్షణ, ఆర్థిక, మీడియా వంటి రంగాలను లక్ష్యంగా చేసుకోవచ్చని ఏజెన్సీ తెలిపింది. భద్రతా వ్యవస్థలను ఛేదించడానికి హ్యాకర్లు స్పియర్ ఫిషింగ్, మాల్వేర్, డీప్‌ఫేక్ వ్యూహాలను ఉపయోగించవచ్చని సలహాలో పేర్కొంది. "హ్యాకర్లు రహస్య సమాచారాన్ని దొంగిలించడానికి, సంస్థల ప్రైవసీను ఉల్లంఘించడానికి ప్రయత్నించవచ్చు" అని కూడా హెచ్చరించింది. తమ సైబర్ భద్రతా రక్షణను బలోపేతం చేయాలని, రాబోయే ముప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సంస్థలను కోరారు.

Tags:    

Similar News