• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హతవిధీ... యుద్ధం ఆగడానికి...

హతవిధీ... యుద్ధం ఆగడానికి ఇదా కారణం?

| అవును... భారత్ లోని సుమారు 140 కోట్ల మందిలో మెజారిటీ పౌరులు ఊహించని రితీలో యుద్ధం ఆగిపోయింది!

By - Tupaki Desk
Update: 2025-05-11 05:46 GMT

గత కొన్ని రోజులుగా భారత్ - పాక్ మధ్య తీవ్రంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు శనివారం సాయంత్రం 5 గంటలకు అధికారికంగా చల్లబడ్డాయి. ఈ సమయంలో ‘దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు స్పందించారు! ఈ సమయంలో.. భారత్ – పాక్ మధ్య యుద్ధం ఆగడానికి ఇదే అసలు కారణం అంటూ ఒక విశ్లేషణ అంతర్జాతీయ మీడియాలో వస్తుంది!

అవును... భారత్ లోని సుమారు 140 కోట్ల మందిలో మెజారిటీ పౌరులు ఊహించని రితీలో యుద్ధం ఆగిపోయింది! దీంతో.. మొదలైనప్పుడు మోడీ సర్కార్ పై ఎంతటి ప్రశంసలు, అభినందనలు వచ్చాయో.. ఈ ప్రకటన రాగానే అవన్నీ రివర్స్ అయ్యాయనే చర్చ నెట్టింట మొదలైంది! అయితే... కాల్పుల విరమణకు పాకిస్థాన్ ఒప్పుకోవడానికి ఓ కారణం ఉందంటూ కథనాలొస్తున్నాయి!

ఇందులో భాగంగా... భారత్ వ్యతిరేకించినప్పటికీ పాకిస్థాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 1 బిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.8,500 కోట్లు) రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ సహాయన్ని తక్షణం పాకిస్థాన్ కు అందిస్తామని ప్రకటించింది!

అయితే... యుద్ధం విషయంలో వెనక్కి తగ్గాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ నుంచి కీలక దేశాలు (యూఎస్!) కండిషన్ పెట్టాయని.. అందువల్లే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిందని కథనాలొస్తున్నాయి. దీంతో... ఇది పాకిస్థాన్ / అమెరికా రాయించుకున్న పెయిడ్ న్యూస్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు నెటిజన్లు!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ప్రస్తుతం భారత్ - పాక్, ఇరు దేశాలు ఉన్న పరిస్థితుల్లో యుద్ధం ఆపాల్సిన అవసరం భారత్ కంటే ఎన్నో రెట్లు పాకిస్థాన్ కి ఉంది! అలాంటి పాకిస్థాన్ ను ఆయుద్ధం పకపోతే భారత్ కు ఇబ్బంది అన్నట్లుగా అమెరికా ఆడ్డొచ్చి, ఐఎంఎఫ్ నిధులు కావాలంటే యుద్ధం ఆపాలని కండిషన్ పెట్టిందని కథనాలు రావడం ఏమిటో?

ఏది ఏమైనా... భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వమే కారణం అని చెప్పడం.. ఇప్పుడు ఇలాంటి కథనాలు అంతర్జాతీయ మీడియాలో రావడం... ఈ ప్రపంచానికి తానే పెద్దన్న అని ట్రంప్ మరోసారి గుర్తుచేయడం కూడా అయ్యి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు!

Tags:    
  • IndiaPakistanCeasefire 
  • TrumpDiplomacy 
  • IMFLoan 
  • USPakistanRelations 
  • CeasefireAgreement 
  • TrumpIntervention 
  • IndiaPakistanTensions 
  • IndiaPakistanConflict 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS