ఏఐ రేసులో భారత్ అసలు బలం అదేనా? అమెరికా, చైనాలకు భిన్నమైన 'దేశీ' వ్యూహం
భారీ ఏఐ మోడల్స్, సూపర్ కంప్యూటర్లు, జీపీయూ (జీపీయూ)ల రేసులో ఈ రెండు దేశాలతో పోటీపడటం భారత్‌కు సవాలే. అయితే గ్లోబల్ ఏఐ రేసులో భారత్‌ను ముందంజలో నిలిపే ఒక విశిష్టమైన "హిడెన్ అడ్వాంటేజ్" ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసు తీవ్ర రూపం దాల్చుతోంది. ఒకవైపు ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులతో అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్స్, భారీ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై అమెరికా దృష్టి పెడితే.. మరోవైపు చిప్ తయారీ, డేటా సెంటర్లు, మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యంతో చైనా దూసుకుపోతోంది. భారీ ఏఐ మోడల్స్, సూపర్ కంప్యూటర్లు, జీపీయూ (జీపీయూ)ల రేసులో ఈ రెండు దేశాలతో పోటీపడటం భారత్‌కు సవాలే. అయితే గ్లోబల్ ఏఐ రేసులో భారత్‌ను ముందంజలో నిలిపే ఒక విశిష్టమైన "హిడెన్ అడ్వాంటేజ్" ఉంది.
డిజిటల్ మౌలిక వసతులే భారత్ నిజమైన శక్తి
భారత్ వద్ద ఉన్న అతిపెద్ద ఆయుధం డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్టక్ర్చర్ (డీపీఐ). ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఓఎన్.డీసీ వంటి వ్యవస్థలు ఇప్పటికే కోట్లాది మంది ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. సున్నా నుంచి కొత్తగా మౌలిక వసతులు నిర్మించాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఈ డిజిటల్ నెట్‌వర్క్‌పైనే కొత్త ఏఐ సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావచ్చు.
140 కోట్ల జనాభా.. ఒక భారీ రియల్ వరల్డ్ ల్యాబ్
వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, రవాణా రంగాలతో పాటు వందలాది ప్రాంతీయ భాషల్లో ఏఐని ఉపయోగించే అపారమైన అవకాశం భారత్‌కు ఉంది. కేవలం పరిశోధనా ల్యాబ్‌లకే పరిమితం చేయకుండా 140 కోట్ల మంది యూజర్ల మధ్య ఏఐని నేరుగా "మాస్ డిప్లాయ్‌మెంట్" చేసే సామర్థ్యం మన సొంతం. ఎకనామిక్ సర్వే కూడా సూచించినట్లుగా భారత్ వ్యూహం కేవలం ఫ్రాంటియర్ మోడల్స్ తయారీపై కాకుండా ప్రజా సమస్యలను తీర్చే అప్లికేషన్ ఆధారిత ఏఐ వైపు సాగుతోంది.
యుపిఐ ఫార్ములాతో "యూజ్‌ఫుల్ ఏఐ" దిశగా..
అమెరికా లక్ష్యం "పవర్ ఫుల్ ఏఐ" కాగా.. భారత్ లక్ష్యం సంక్లిష్టమైన సాంకేతికతను సామాన్యుడికి చేరవేసే "ఉపయోగపడే ఏఐ".
సంక్లిష్టమైన బ్యాంకింగ్ సాంకేతికతను కూడా మనం సులువైన ఇంటర్‌ఫేస్ ద్వారా సామూహిక వినియోగంతో యుపిఐ విజయం సాధ్యమైంది. ఇప్పుడు ఏఐ సాంకేతికతను ప్రాంతీయ భాషలను మార్చి తక్కువ ఖర్చు సామూహిక వినియోగం చేస్తే ఏఐ మోడల్ విజయం సాధ్యమవుతుంది.
భారత్‌లోని భారీ ఐటీ ఇంజనీరింగ్ వర్క్‌ఫోర్స్, వేగంగా పెరుగుతున్న ఎంటర్‌ప్రైజ్ ఏఐ పెట్టుబడులు మన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా ప్రకారం ఏఐ ఏజెంట్లతో పనిచేసే ఫ్రాంటియర్ ప్రొఫెషనల్స్‌లో భారత్ ముందంజలో ఉంది.
అయితే జీపీయూలపై విదేశీ ఆధారపడటం, డేటా గవర్నెన్స్, ఏఐ సేఫ్టీ, డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరా, సొంత ఫౌండేషన్ మోడల్స్ లేకపోవడం వంటి సవాళ్లు భారత్ ముందున్నాయి. అలాగే అడాప్షన్ వేగంగా ఉన్నా, రిస్క్ అసెస్‌మెంట్, ప్రాపర్ గవర్నెన్స్ వ్యవస్థలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది.
ఏఐ విజయం అనేది కేవలం "ఎవరి మోడల్ పెద్దది?" అనే అంశంపైనే కాకుండా "ఎవరు తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేశారు?" అనే ఎగ్జిక్యూషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో భారత్ గ్లోబల్ ఏఐ రేసులో తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏఐ రేసులో ఇండియా అమెరికాను, చైనాను వాటి గేమ్‌లో ఓడించగలదా? అంటే బహుశా కాదు. కానీ ఏఐని ప్రపంచంలోనే అత్యంత పెద్ద జనాభా ఉన్న మనదేశంలో ఈజీ వేలో ఉపయోగించేలా మార్చడంలో ఇండియా కొత్త గేమ్‌నే సృష్టించగలదా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఆ దిశగా ఆలోచిస్తే మనం అమెరికా, చైనాను అధిగమించవచ్చు.