కేటీఆర్, హరీష్‌రావుపై మహిళా కానిస్టేబుల్ కేసు.. నిలబడుతుందా?
తనపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కేటీఆర్ సహా.. పలువురు లైంగిక వేధింపులకు పాల్పడ్డారం టూ.. మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కేటీఆర్ సహా.. పలువురు లైంగిక వేధింపులకు పాల్పడ్డారం టూ.. మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వారం ప్రారంభంలో తెలంగాణ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ వెయ్యిరోజుల పాలనపై నిరసనగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి గన్ పార్కు నుంచి పాదయాత్రగా అసెంబ్లీ వరకు వచ్చా రు. ఈ సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ ఘటన అటు ప్రభుత్వం.. ఇటు ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలో పోలీ సులు తమపై దాడులు , దౌర్జన్యం చేశారని బీఆర్ ఎస్ నాయకులు ఆరోపించారు. కానీ.. ఇదే సమయంలో పోలీసులపై వారే దౌర్జన్యాలకు దిగారని అధికార పక్షం ఆరోపించింది. ఇలా.. ఉన్న ఈ వ్యవహారంలో తాజాగా గురువారం సాయంత్రం యూటర్న్ చోటు చేసుకుంది. నాడు విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్.. సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. పురుష ఎమ్మెల్యేలు తనను తాకుతూ.. దుర్భాషలాడారని, విధులకు ఆటం కలిగించారని ఈ కేసులో ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక, ఈ వ్యవహారంతో మరింతగా రాజకీయం వేడెక్కింది. మహిళా కానిస్టేబుల్‌ను రాజకీయాల్లోకిలాగుతారా? అంటూ.. బీఆర్ ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఈ కేసు నిలబడేనా?
చట్టపరంగా చూస్తే.. విధులకు ఆటంకలిగించడం.. మహిళాపోలీసుపై విరుచుకుపడడం వంటి తప్పే. అయితే.. అలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని గుర్తించినప్పుడు.. ముందుగా అంచనా వేసిన ప్పుడు.. ఉన్నతాధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం సమయంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గతంలోనూ ఇలాంటి కేసులు పలు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. వీటిని రాజకీయ కోణంలో చూస్తున్నామంటూ.. మద్రాస్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టులు పేర్కొన్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి.