ఎన్నారైలు మ‌రింత శ‌క్తిమంతం.. ఈ సారి కూట‌మికి ల‌క్.. !

తాజాగా టీడీపీ ఎన్నారై.. క‌మిటీని నియ‌మించింది. వాస్త‌వానికి.. ఎన్నారైలు.. ఆది నుంచి టీడీపీకి మ‌ద్ద‌తు గానే ఉన్నా.. 2023లో చంద్ర‌బాబు అరెస్టు అనంత‌రం.. ఒకేతాటిపైకి వ‌చ్చారు.

Update: 2026-09-10 10:30 GMT

తాజాగా టీడీపీ ఎన్నారై.. క‌మిటీని నియ‌మించింది. వాస్త‌వానికి.. ఎన్నారైలు.. ఆది నుంచి టీడీపీకి మ‌ద్ద‌తు గానే ఉన్నా.. 2023లో చంద్ర‌బాబు అరెస్టు అనంత‌రం.. ఒకేతాటిపైకి వ‌చ్చారు. ఆయ‌న‌కు అనుకూలంగా నిర‌స‌న చెప్ప‌డంతో పాటు.. దేశ విదేశాల్లోని వారు.. ఏక‌మై.. నాడు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా పోరాటాలు కూడా సాగించారు. అదేస్ఫూర్తిని గ‌త ఎన్నిక‌ల్లోనూ చూపించారు. కూట‌మి స‌ర్కారు విజ‌యం ద‌క్కించుకు నే విధంగా ఎన్నారైలు.. రంగంలోకి దిగి విస్తృత ప్ర‌చారం చేశారు.

ఎక్క‌డెక్క‌డ నుంచో సొంత నిధులు ఖ‌ర్చు చేసుకుని ఏపీకి వ‌చ్చి.. గ్రామ గ్రామానా తిరిగారు. ఫ‌లితంగా కూట‌మి విజ‌యంలో ఎన్నారైల పాత్ర అమోఘ‌మ‌నే మాట వినిపించింది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబం ధించి కూట‌మి ప్ర‌భుత్వం ప‌క్షాన టీడీపీ ఒక ర‌కంగా ప్ర‌పంచ దేశాల స్థాయిలో ఎన్నారై క‌మిటీని నియ‌మిం చింది. `ఎన్నారై గ్లోబల్ టీడీపీ` కార్య‌వ‌ర్గంగా పిలుచుకునే ఈ క‌మిటీ.. 2029 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ప‌నిచేయ‌నుంది.

అయితే.. గ‌త ఎన్నారై క‌మిటీకి.. ప్ర‌స్తుత క‌మిటీకి చాలానే తేడా ఉంది. ఎన్నారై గ్లోబల్ టీడీపీ అధ్యక్షుడిగా పి. గురు రాజాతోపాటు సభ్యుల‌ను విస్తృత సంఖ్య‌లో పెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు 34 మంది స‌భ్యుల‌ను నియ‌మించారు. మ‌రో 16 మందిని కూడా త్వ‌ర‌లోనే నియ‌మించారు. వీరిలో వివిధ దేశాల‌కు చెందిన వారు ఉన్నారు. త‌ద్వారా.. ఎన్నారై క‌మిటీలు బ‌లోపేతం కావ‌డంతోపాటు.. మ‌రింత అంకిత భావంతో ప‌నిచేయాల‌న్న‌ది టీడీపీ ఉద్దేశం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఎన్నారైల పాత్ర ఉండ‌నున్నంద‌న్న విష‌యాన్ని టీడీపీ చెప్ప‌క‌నే చెప్పింది. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి పార్టీలు.. మ‌ద్ద‌తు ఇచ్చే ఇత‌ర పార్టీలు.. స‌హా.. ఇప్పుడు ఎన్నారైలు కూడా తోడైతే.. ఊరూవాడా .. కూట‌మి విజ‌యానికి మ‌రింత మంది క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో వైసీపీకి కార్య‌క‌ర్త‌ల సంఖ్య లేక‌పోవ‌డం.. ముఖ్యంగా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చే వారు లేక‌పోవ‌డం వంటివి కూట‌మికి ముఖ్యంగా టీడీపీకి క‌లిసి రానున్నాయి.

Tags:    

Similar News