కలెక్టర్లకు కూడా ఆ బాధ్యతలు.. బాబు బిగ్ స్ట్రాటజీ.. !
కూటమిలో సమన్వయాన్ని మెరుగు పరుస్తూ.. మరోవైపు.. పార్టీల పరంగా తీసుకోవాల్సిన నిర్ణయంపై ఎక్కడా తడబాటు లేకుండా కూడా చూసుకుంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అన్ని వైపుల నుంచి ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు.. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా గెలుపు దక్కించుకునేందుకు వ్యూహాలతో ముందు కు సాగుతోంది. కూటమిలో సమన్వయాన్ని మెరుగు పరుస్తూ.. మరోవైపు.. పార్టీల పరంగా తీసుకోవాల్సిన నిర్ణయంపై ఎక్కడా తడబాటు లేకుండా కూడా చూసుకుంటున్నారు.
ఈ క్రమంలో పార్టీల బాధ్యతలు నాయకులు చూసుకున్నా.. ఇప్పుడు కలెక్టర్ల వంటి జిల్లాస్థాయి అధికారులను కూడా స్థానిక ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే.. ఇది రాజకీ యంగా కాదు. కలెక్టర్లకు రాజకీయ వాసనలు లేకుండా.. పాలనపరంగానే వారిని కార్యోన్ముఖులను చేయా లని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల కు ముందుస్థానికంగా ఉన్న సమస్యల ను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీనిలో భాగంగానే.. గురువారం నుంచి కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రధాన అంశాలతోపాటు.. కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని సైతం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు పంచుకుంటారు. తద్వారా.. స్థానికంగా ప్రజల నాడి తెలిసిన కలెక్టర్లకు.. మరిన్ని విస్తృత అధికారాలు ఇవ్వడంతోపాటు.. నిధులు కూడా మంజూరు చేయాలని నిర్ణయించారు. తద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వచ్చే 40 రోజుల్లో పరిష్కరించే బాధ్యతలను వారికి అప్పగించనున్నారు.
దీంతో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పక్కాగా అన్ని వైపుల నుంచి కూడా ప్రభుత్వం తన ప్రయ త్నాలు ముమ్మరం చేసినట్టు అవుతుంది. ఇక, రాజకీయంగా పార్టీల నాయకులు సమన్వయం గా ముందుకు సాగనున్నారు. అటు పాలిటిక్స్ పరంగా నాయకులు, ఇటు స్థానిక సమస్యలపై కలెక్టర్లతో వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ద్వారా స్థానిక ఎన్నికల్లో పక్కా విజయం దక్కించుకునేందుకు సీఎంచంద్రబాబు స్ట్రాటజిక్‌గా ముందుకు సాగుతున్నారు.