క‌లెక్ట‌ర్లు కూడా కౌంట‌ర్ ఇవ్వాలి.. చంద్ర‌బాబు తేల్చేశారు!

జిల్లా క‌లెక్ట‌ర్లు.. కేవ‌లం పాల‌న వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అయితే.. మార్కులు ప‌డ‌బోవ‌ని సీఎం చంద్ర బాబు తేల్చి చెప్పారు.

Update: 2026-09-10 14:30 GMT

జిల్లా క‌లెక్ట‌ర్లు.. కేవ‌లం పాల‌న వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అయితే.. మార్కులు ప‌డ‌బోవ‌ని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్ర‌జ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు.. చైత‌న్యం చేసేలా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ''ఐఏఎస్‌లు అయిపోయాం.. కాబ‌ట్టి పాల‌న వ‌ర‌కు ప‌రిమితం అవుతామంటే కుద‌ర‌దు. మారుతున్న కాలాని.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు అనుగుణంగా మీరు మారాలి. ఈ విష‌యంలో ఒక‌రిద్ద‌రు ముందుకు వ‌స్తున్నారు. ఇత‌రులు వెనుక‌బ‌డుతున్నారు.'' అని చంద్ర‌బాబు అన్నారు.

తాజాగా స‌చివాల‌యంలో జిల్లాల క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సును ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్లు.. కూడా కౌంట‌ర్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు తేల్చిచెప్పారు. వైసీపీ నాయ‌కులు చేస్తున్న దుష్ప్ర‌చా రాన్ని రాజ‌కీయ నాయ‌కులు త‌మ శైలిలో కౌంట‌ర్ ఇస్తార‌ని అన్నారు. అయితే.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ప్ర‌ణాళిక బ‌ద్ధంగా చేస్తున్న న‌కిలీ ప్ర‌చారాన్నిఎదుర్కొనేందుకు.. తిప్పికొట్టేందుకు కలెక్ట‌ర్లు కూడా.. విధాన‌ప‌ర‌మైన అంశాల‌తో కౌంట‌ర్లు ఇవ్వాల‌ని సూచించారు.

ఇటీ వ‌ల మెగా డీఎస్సీ 2025పై వైసీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడు.. సంబంధిత విద్యాశాఖ ఉన్న‌తా ధికారులు త‌మీమ్ అన్సారియా స‌హా.. కోన శ‌శిధ‌ర్ వంటివారు.. బ‌ల‌మైన వాయిస్ వినిపించార‌ని.. ఆధారాల‌తో స‌హా.. తిప్పికొట్టార‌ని ప్ర‌శంసించారు. మిగిలిన విభాగాల‌కు చెందిన అధికారులు కూడా ఇదే స్ఫూర్తిని కొన‌సాగించాల‌న్నారు. ముఖ్యంగా క‌లెక్ట‌ర్లు కూడా మీడియా ముందుకు రావాల‌ని.. జిల్లా స్థాయిలో జ‌రుగుతున్న ఫేక్ ప్ర‌చారాల‌ను తిప్పికొట్టాల‌ని సూచించారు.

మార్కులు ఊరికేనే రావు..

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ల‌కు మార్కుల విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. కేవ‌లం ఫైళ్ల‌ను తిర‌గేస్తూ.. ప‌నిచేసుకుంటూ పోతే.. మార్కులు రావ‌ని అన్నారు. త‌మ‌లోని సామ‌ర్థ్యాన్ని కూడానిరూపించుకోవాల‌ని సూచించారు. అది ఏ రూపంలో ఉన్నా.. ప్ర‌భుత్వానికి మేలు చేసేలా ఉండాల‌ని అన్నారు. ఈ విష‌యం లో క‌లెక్ట‌ర్లు వెనుక‌బ‌డితే.. మార్కులు రావ‌ని చెప్పారు. నాయ‌కుల‌తో క‌లివిడిగా ఉండాల‌ని.. అధికారులు అయినంత మాత్రాన‌.. ప్రివిలేజ్ ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News