ఆరేళ్లు.. రూ.12 వేల లక్షల కోట్లు.. మనోళ్ల డిజిటల్ చెల్లింపుల విశ్వరూపం

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ప్రపంచంలో తోపు దేశాలు.. డెవలప్ మెంట్ లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించేవి చాలానే ఉంటాయి.;

Update: 2025-07-29 04:30 GMT

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ప్రపంచంలో తోపు దేశాలు.. డెవలప్ మెంట్ లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించేవి చాలానే ఉంటాయి. కానీ.. కొత్త కాన్సెప్టుల్ని అందిపుచ్చుకోవటం.. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఆ కొత్త టెక్నాలజీని వినియోగించే విషయంలో మనోళ్లలో ఉన్నంత చొరవ.. ఉత్సాహం.. టాలెంట్ వేరే దేశస్తులకు ఉండదనే చెప్పాలి. చెల్లింపు తీరును సమూలంగా మార్చేసిన డిజిటల్ చెల్లింపులు దేశవ్యాప్తంగా ఎంతటి సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిజిటల్ చెల్లింపుల అంశంలో భారత్ లో అమలవుతున్న విధానం.. విస్తరిస్తున్న వైనంపై విదేశీయులు సైతం అవాక్కు అయ్యే పరిస్థితి.

ఇదెంత భారీగా ఉంటుందన్న విషయం తాజాగా కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. ఆరేళ్ల వ్యవధిలో మన దేశంలో 12 వేల లక్షల కోట్ల రూపాయిల డిజిటల్ చెల్లింపులు జరిగినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని మరింత పెంచేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు.. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఫిన్ టెక్ లు.. బ్యాంకులు.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత వర్గాలు అందరితోనూ తాము పని చేస్తున్నట్లు చెప్పారు.

అయితే.. దేశంలోని చిన్న నగరాలు.. ఈశాన్య రాష్ట్రాలు.. జమ్ము కశ్మీర్ లో డిజిటల్ చెల్లింపుల స్వీకరణకు అవసరమైన మౌలిక వసతుల్ని ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద చెల్లింపుల వ్యవస్థగా యూపీఐ ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు. పెద్ద పెద్ద నగరాలు మొదలు పల్లెల వరకు ఈ డిజిటల్ చెల్లింపుల వేగంగా విస్తరించటం తెలిసిందే. కొవిడ్ సంక్షోభం వేళ.. డిజిటల్ చెల్లింపులు పెద్ద ఎత్తున ఊపందుకోవటం తెలిసిందే.

దీనికి తోడు దేశంలో డేటా చౌకగా ఉండటం.. స్మార్ట్ ఫోన్ల వినియోగం అనూహ్యంగా పెరగటంతో యూపీఏ పేమెంట్ల జోరు అంతకంతకూ ఎక్కువైన పరిస్థితి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా యూపీఏ నిలచిింది.ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సెటిల్ మెంట్ ప్లాట్ ఫామ్ వీసా రోజువారీ లావాదేవీల సంఖ్యకు యూపీఏ దగ్గరకు వచ్చేసింది.

జూన్ రెండో తేదీన యూపీఐ ద్వారా రికార్డు స్థాయిలో 65 కోట్ల లావాదేవీలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏప్రిల్ - జూన్ మూడు నెలల కాలానికి దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా యూపీఐ లావాదేవీలు జరిపి మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక.. ఉత్తరప్రదేశ్.. తెలంగాణ.. తమిళనాడులు నిలిచాయి. రానున్న రోజుల్లో డిజిటల్ పేమెంట్లు మరింత భారీగా జరిగే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News