గ్లాస్ గుర్తుతో ఇలా చేస్తున్నోళ్ల మీద ఈసీ చర్యలు తీసుకోదా?

కొన్నిసార్లు రూల్ బుక్ ను యథాతధంగా ఫాలో కావటం ఎంత కష్టమో తెలిసిందే.

Update: 2024-05-06 05:16 GMT

కొన్నిసార్లు రూల్ బుక్ ను యథాతధంగా ఫాలో కావటం ఎంత కష్టమో తెలిసిందే. రూల్ బుక్ ను ఫాలో అవుతూ.. అప్పుడప్పుడు తర్కంతో ప్రశ్నలు వేసుకోవటం ద్వారా మరింత ఎఫెక్టివ్ గా పని చేసే వీలుంటుంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మిస్ అయ్యిందన్న విమర్శ ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తోంది. ఏదైనా రాష్ట్రంలో అధికార.. విపక్షాల మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగే వేళలో.. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ సంస్థలు న్యాయం చేసినట్లు అవుతుంది.

రాజకీయ పార్టీలకు కుయుక్తులు పన్నే అవకాశాన్ని ఎన్నికల సంఘం ఇవ్వటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న. ఏపీలో జరుగుతున్న ఎన్నికల పోరులో.. జనసేన పార్టీకి కేటాయించిన గ్లాస్ గుర్తును మరికొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవ్వటం దేనికి నిదర్శనం? ఫ్రీ సింబల్ గా ఉన్న కారణంగా గ్లాసు గుర్తును పలువురికి ఇచ్చినట్లుగా చెబుతున్న ఎన్నికల అధికారులు.. ఏపీలో జరుగుతున్న ఆరాచకాన్ని ఏమనాలి?

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన.. టీడీపీ.. బీజేపీ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో.. జనసేన గాజు గుర్తు ఫ్రీ సింబల్ కిందకు వచ్చింది. దీన్ని ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీకి కేటాయించారు. ఈ పార్టీ అభ్యర్థిగా గొల్లపల్లి శ్రీ ఫణిరాజ్ బరిలో ఉన్నారు. తనకు వచ్చి గాజు గ్లాస్ గుర్తుతో ప్రచార రథాల్నిసిద్ధం చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. అందులో పవన్ కల్యాణ్ ఫోటోను కూడా పెద్దగా ప్రింట్ చేసి ప్రచారంచేయటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.

Read more!

ఇదే విషయాన్ని సదరు అభ్యర్థిని టీడీపీ.. జనసేన.. బీజేపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు నిలదీయగా నీళ్లు నమలటం చూస్తే.. కూటమి అభ్యర్థిని దెబ్బ తీసేందుకే ఈ కుయుక్తి అన్న మాట వినిపిస్తోంది. ఈ తీరుపై ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేశారు. ఈ తరహా తప్పులపై గంటల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ప్రత్యర్థి పార్టీని దెబ్బ తీసేలా ఇలాంటి చర్యల్ని అస్సలు ఉపేక్షించకూడదు. అంతేకాదు.. తమ పార్టీకి సింబల్ గా కేటాయించిన దానిని ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయిస్తే.. తమకు.. తమ కూటమికి నష్టం వాటిల్లుతుందన్న అంశంపై ఇప్పటికే అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ వాటిని ఎన్నికల సంఘం పట్టించుకున్నది లేదు. మరిప్పుడు జరుగుతున్న దానిపై ఎన్నికల అధికారులు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.

Tags:    

Similar News