సూపర్ మార్కెట్లకు పరుగులు పెడుతున్న అమెరికా జనం..!

అమెరికాలో పనులు, కూరగాయలు, పాలు వంటి తక్కువ నిల్వయ్యే ఆహార పదార్థాలు పెద్ద ఎత్తున కొనుగోలు అవుతున్నాయి.;

Update: 2025-04-06 04:15 GMT

ట్రంప్ సర్కార్ ఆమోదించిన తాజా టారిఫ్‌లు అమెరికాలో ప్రజలను ముందస్తుగా షాపింగ్ చేయించేలా చేస్తున్నాయి. ధరలు పెరిగే అవకాశం ఉండటంతో.. ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు మొదలైనవిపై ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా టారిఫ్‌లు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ దిగుమతి పన్నులు త్వరలో అమలులోకి రానుండటంతో..అమెరికన్లు తమ అవసరమైన వస్తువులను ముందే కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై ధరలు పెరగబోతున్నందున..ఇది సాధారణ వినియోగదారులకు పెద్ద భారం కానుంది.

ఎక్కువగా ఏమి కొనుగోలు చేస్తున్నారంటే..?

అమెరికాలో పనులు, కూరగాయలు, పాలు వంటి తక్కువ నిల్వయ్యే ఆహార పదార్థాలు పెద్ద ఎత్తున కొనుగోలు అవుతున్నాయి. ఇక మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, షూస్, మందులు, కార్ల విడిభాగాలు వంటి దిగుమతి వస్తువులపై.. కూడా డిమాండ్ పెరిగింది.

ఇంటికి కొత్తగా నిర్మాణం చేపట్టేవాళ్లు కూడా.. నిర్మాణ సామగ్రిని ముందే కొనుగోలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం.. ఒక కొత్త ఇంటి నిర్మాణ ఖర్చు సుమారు 9,000 డాలర్ల వరకూ పెరిగే అవకాశం ఉంది.

మధ్యతరగతి వారికి భారంగా మారనున్న టారిఫ్‌లు

నేషనల్ కన్స్యూమర్స్ లీగ్‌కి చెందిన పాలసీ నిపుణుడు జాన్ బ్రేయాల్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2న అమలులోకి వచ్చే టారిఫ్‌లతో తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు సంవత్సరానికి సుమారుగా 980 డాలర్ల నష్టంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే జీవిత ఖర్చులు అధికంగా ఉన్న సమయంలో ఇది మరింత ఇబ్బందికరంగా మారనుంది.

ఈ క్రమంలో నిపుణులు పానిక్ కాకుండా జాగ్రత్తగా షాపింగ్ చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచగలిగే వస్తువులను కొంత మేరకు నిల్వ చేయవచ్చు. కానీ వేగంగా పాడయ్యే వస్తువులను అధికంగా కొనుగోలు చేయడం వల్ల నష్టమే కలగుతుంది. ఉదాహరణకి.. సరైన నిల్వ లేకుండా ఎక్కువగా చేపల మాంసం తీసుకుంటే, అది వ్యర్థమవుతుంది. అందుకే కొనుగోలు చేసే ముందు నిల్వ ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం.

ఎప్పుడు అమలులోకి వస్తాయంటే?

ఈ శనివారంతో మొదటి దశ టారిఫ్‌లు ప్రారంభమవుతాయి. అన్నీ దిగుమతులపై 10 శాతం పన్ను వేయనున్నట్టు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఇక ఏప్రిల్ 9 నుంచి మరింత అధిక శాతం టారిఫ్‌లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే అమెరికన్లు ముందుగానే షాపింగ్ చేయడం మొదలుపెట్టారు.

Tags:    

Similar News