ప్రెస్ క్లబ్ పోరు: వరికుప్పలకు ఓటేద్దాం.. పాత్రికేయులను `కాపాడుదాం`!
ఇక, ఇలాంటి వేదనలకు-విరుపులకు, ఆవేదనలకు-ఆక్రందనలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైంది!. మనలోమనం కుమిలిపోయే కాలానికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పట్టే సమయం వచ్చేసింది.;
+ నానాటికి నాసిగా మారుతున్న పాత్రికేయ విలువలపై పెదవి విరుస్తాం.
+ నిరంతరం ప్రజల్లోనే ఉన్నా.. మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని గగ్గోలు పెడదాం.
+ చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నాం.. మాకేదైనా జరిగితే ఎవరు దిక్కు? అంటూ.. దీనంగా వేదిస్తాం.
+ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే.. పెద్ద దిక్కు ఎవరని దిక్కులు చూస్తాం.
+ ఇది తన, మన అన్న తేడా లేకుండా.. ప్రతి పాత్రికేయుడి ఆవేదన, ఆక్రందన!.
--- ఇక, ఇలాంటి వేదనలకు-విరుపులకు, ఆవేదనలకు-ఆక్రందనలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైంది!. మనలోమనం కుమిలిపోయే కాలానికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పట్టే సమయం వచ్చేసింది. మన కోసం.. మన జర్నలిస్టు మిత్రుల కోసం `నేనున్నానంటూ`.. ముందుకు వచ్చిన ఈనాడు పాత్రికేయుడు.. వరికుప్పల రమేష్‌కు మద్దతుగా నిలుద్దాం. మనకోసం సమయం కేటాయించి.. జర్నలిస్టుల జీవితాలకు మెరుగైన భద్రత కల్పించే దిశగా అడుగులు వేస్తామని నిండు మనసుతో భరోసా కల్పిస్తున్న `రమేష్`ను గెలిపించుకుందాం.
ఈ నెల 26న(ఆదివారం) జరగనున్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో సీరియల్ నెంబరు 4పై ఓటు వేయడం ద్వారా వరికుప్పల రమేష్‌ను గెలిపించుకునే సువర్ణావకాశం.. మనకోసం నిరంతరం తపించే.. అవిశ్రాంతంగా శ్రమించే.. పాత్రికేయుడు రమేష్‌ను విజయ తీరాలకు చేర్చే అద్భుతావకాశం ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. ఒక్క ఓటుతో పాత్రికేయులు తమ భరోసాను తామే లిఖించుకునే ఛాన్స్ చేరువైంది.
మరెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం జరిగే హైదరాబాద్ ప్రెస్‌క్లబర్ ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానెల్‌పై పోటీలో ఉన్న వరికుప్పల రమేష్(ఈనాడు)కు ఓటేయడం ద్వారా పాత్రికేయ విలువలను కాపాడుకుందాం. చిన్న చిన్న ప్రలోభాలకు లొంగితే మన జీవితాలకు శాశ్వత రక్షణ ఉండదన్న విషయాన్ని సైతం గుర్తిద్దాం. జర్నలిస్టుల `వేగు`... సీరియల్ నెంబరు `నాలుగు` అన్న సంగతిని మదిలో ఇముడ్చుకుందాం!!.
ఇవీ భరోసాలు
+ రూపాయి ఖర్చులేకుండా రూ.5 లక్షల వరకు బీమా(ఇన్సూరెన్స్)
+ జర్నలిస్టులకు విధినిర్వహణలో ప్రాణాపాయం కలిగితే.. ఈ మొత్తాన్నీ కుటుంబ సభ్యులకు అందిస్తారు.
+ పాత్రికేయ కుటుంబాల్లోని వారు తీవ్ర అనారోగ్యాలపాలైతే.. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు.
+ ఈ సేవలకు కూడా రూ.5 లక్షల వరకు చెల్లింపు. దీనికి కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.
+ అంతేకాదు.. ప్రెస్‌క్లబ్ సభ్యులపైనా ఎలాంటి భారం లేకుండా నిర్ణయాల అమలు.