• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'బట్టతల' ఉందని భార్య...

'బట్టతల' ఉందని భార్య 'సింగిల్' స్టేటస్... భర్త ఆత్మహత్య!

| భార్యల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల జాబితా ఇటీవల పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-03-17 05:37 GMT

ఇటీవల కాలంలో భార్యల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైనప్పటికీ... తన భార్యల వేధింపులు తారాస్థాయికి చేరుకుంటున్నాయని చెబుతూ.. సెల్ఫీ వీడియోలు తీసుకుని, సూసైడ్ లేఖలు రాసి ఇటీవల కాలంలో చాలా మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమయంలో తాజాగా మరో వ్యక్తి ఈ పనికి పూనుకున్నారు.

అవును... భార్యల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల జాబితా ఇటీవల పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ జాబితాలో మరో వ్యక్తి చేరారు. అయితే... బట్టతల అంటూ కట్టుకున్న భార్యే అవహేళన చేయడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర తాలూకాలోని ఉడిగాలలో ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది.

పోలీసులు చెబుతోన్న వివరాల ప్రకారం... పరమశివమూర్తి (32)కి మమతతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పరమశివమూర్తి లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు పెళ్లి సమయానికే బట్టతల ఉంది. కాకపోతే పెళ్లి తర్వాత ఉన్న కాస్త జుట్టు కూడా రాలిపోయింది. దీంతో భార్య సూటిపోటి మాటలతో అతనిని వేధించేది!

నీకు నెత్తి మీద జుట్టు లేదు.. నీతో బయటకు రావాలంటే సిగ్గుగా ఉంది.. వంటి మాటలు అనేది! దీంతో... తరచూ ఇద్దరి మధ్యా ఈ విషయంపై గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో... భర్తపై గృహహింస, కట్నం వేధింపుల కేసు కూడా పెట్టడంతో కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు పరమశివమూర్తి. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు.

అయితే... జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన పరమ శివమూర్తి.. భార్య సోషల్ మీడియాలోని స్టేటస్ "సింగిల్" అని ఉండటం చూసి మరింత ఆవేదన చెందాడు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఓ నోట్ రాసి పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చెసుకున్నాడు. దీంతో... ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
  • DomesticAbuse 
  • Harassment 
  • Husband 
  • DomesticViolence 
  • ParamaShivaMurthy 
  • MentalHealth 
  • EndDomesticAbuse 
  • StopHarassment 
  • FamilyViolence 
  • SupportForMen 
  • AbuseAwareness 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS