• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెళ్లి రోజునుంచే హత్య...

పెళ్లి రోజునుంచే హత్య ప్లాన్ చేసిన సోనమ్?

| మేఘాలయ రాష్ట్రంలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయంలో వెలుగుచూస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-06-11 09:51 GMT

మేఘాలయ రాష్ట్రంలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయంలో వెలుగుచూస్తున్నాయి. పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో సోనమ్, రాజా రఘువంశీ జంట కనిపిస్తుంది. అయితే ఈ వీడియో బయటపడటం, ఆ తర్వాత సోనమ్ పోలీసులకు లొంగిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఈ జంటలో, భర్త రాజా రఘువంశీని సోనమ్ హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

పెళ్లి వీడియోలో రాజా ఎంతో ఆనందంగా సోనమ్ నుదుటిపై సింధూరం దిద్దుతూ కనిపిస్తాడు. పక్కన పూజారి వివాహ మంత్రాలు చదువుతుండగా, సోనమ్ మాత్రం ఏమాత్రం హర్షం లేకుండా పెళ్లి ఇష్టం లేని చూపులతో కనిపిస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ముఖంపై ఎలాంటి భావోద్వేగం లేకపోవడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సోనమ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "పెళ్లి చేసుకోవద్దని చెప్పడానికి ధైర్యం లేకపోయినా, హత్య చేయించడానికి గూండాలను పెట్టే ధైర్యం ఉంది. ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి ఉండవచ్చు. ఇది పూర్తిగా నివారించదగిన ఘటన" అంటూ కొందరు కామెంట్ చేశారు.

మరికొందరు "ఆమె ముందు నుంచే ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అలాంటి పరిస్థితిలో కూడా బలవంతంగా ఈ పెళ్లి జరిపారంటే బాధ్యత కుటుంబం తీసుకోవాలి" అంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. "పెళ్లి చేసుకునే ముందు బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయడం తప్పనిసరి" అంటూ కొందరు సూచిస్తున్నారు.ఒక నెటిజన్ తీవ్రంగా స్పందిస్తూ "ఆ అమాయకుడు తన హనీమూన్ ట్రిప్ లో ప్రాణాలు కోల్పోతానని కలలోనూ ఊహించలేదు" అని అన్నారు.

ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. సోనమ్ లొంగిపోయిన తరువాత, హనీమూన్ సమయంలో జరిగిన ఘటనలన్నింటినీ పోలీసులు త్వరితగతిన పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడయ్యే వరకు ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Just take a look at this wedding video of Sonam and Raja Raghuvanshi and you will agree that Sonam was clearly not happy with this marriage.

Raja Raghuvanshi would have been alive if Sonam had said No to the marriage. She had the courage to hire contract killers but didn't had… pic.twitter.com/NbHlQQWzXK

— Incognito (@Incognito_qfs) June 9, 2025
Tags:    
  • HoneymoonMur*der 
  • MeghalayaCrime 
  • SonamRajaCase 
  • WeddingGoneWrong 
  • Mur*derMystery 
  • ViralWeddingVideo 
  • TrueCrimeIndia 
  • JusticeForRaja 
  • CrimeInMarriage 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS