కొడుకు ఎదిగి చేతికొస్తే ఆ ఆనందం వేరు.. కేటీఆర్ పరిస్థితి ఇప్పుడు ఇదే

హిమాన్షు తాజాగా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. ఆయన అమెరికాలో సొంతంగా ఉద్యోగం సాధించి ఆ ఆనందాన్ని లింక్డ్ ఇన్ లో పంచకోవడంతో వైరల్ అయ్యింది.;

Update: 2025-12-09 05:17 GMT

మనం పెంచి పెద్దచేసిన కొడుకు మన చేతికి అందివస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది.. ప్రస్తుతం కేటీఆర్ పరిస్థితి ఇప్పుడు ఇదే..తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ పేరు సుపరిచితం.. దశాబ్ధకాలం సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో.. కేటీఆర్ కీలకమంత్రిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత .. ఆయన ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా క్రియాశీలంగా ఉన్నారు.

కేసీఆర్ మనమడు, కేటీఆర్ వారసుడు అయిన కల్వకుంట్ల హిమాన్షు కూడా 2023 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిమాన్షు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట పలు కార్యక్రమాల్లో కనిపించడం.. ముఖ్యంగా భద్రాద్రి సీతారామల కల్యాణానికి తలంబ్రాలు పంపడం వంటి సంఘటనల ద్వారా ప్రజలకు పరిచయం అయ్యారు.

హిమాన్షు తాజాగా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. ఆయన అమెరికాలో సొంతంగా ఉద్యోగం సాధించి ఆ ఆనందాన్ని లింక్డ్ ఇన్ లో పంచకోవడంతో వైరల్ అయ్యింది. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన హిమాన్షు అక్కడే ఉపాధ్యాయుడిగా తన తొలి ఉద్యోగాన్ని పొందాడ. తరగతి గదిలో విద్యార్థిగా మొదలుపెట్టి.. ఉపాధ్యాయుడిగా మారిన తన దశ తనకు వ్యక్తిగతంగా ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని హిమాన్షు లింక్డ్ ఇన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన తొలి ఉద్యోగం అనుభవాన్ని పంచుకుంటూ పోస్ట్ చేసిన ఇది వైరల్ అవుతోంది. హిమాన్షు సాధించిన విజయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అనేక మంది తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

గతంలో కూడా కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు హిమాన్షు కూడా అమెరికాలో జాబ్ సాధించడంపై భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెబతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రాజకీయంగా కుటుంబం ఉన్నత స్థితిలో ఉన్నా కూడా అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి సొంతంగా ఉద్యోగంలోకి అడుగుపెట్టడం హిమాన్షు సాధారణ వ్యక్తిత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ శ్రేణులు కొనియాడతున్నారు.

Tags:    

Similar News