ఇంగ్లండ్ లో అమ్మాయిపై అత్యా*చారం.. పాక్ జాతీయ క్రికెట‌ర్ అరెస్టు

ఇంగ్లండ్ లో పాకిస్థాన్ ప‌రువు పోయింది... ఆ దేశ యువ‌ క్రికెట‌ర్ ఒక‌రు అత్యాచారం కేసులో అరెస్ట‌య్యాడు.;

Update: 2025-08-08 11:30 GMT

ఇంగ్లండ్ లో పాకిస్థాన్ ప‌రువు పోయింది... ఆ దేశ యువ‌ క్రికెట‌ర్ ఒక‌రు అత్యా*చారం కేసులో అరెస్ట‌య్యాడు. పాక్ క్రికెట్ లో ప్ర‌తిభావంతుడైన వ‌ర్ధ‌మాన ఆట‌గాడిగా పేరు తెచ్చుకున్న ఆట‌గాడు క‌ట‌క‌టాల పాల‌య్యాడు. అయితే, ఈ ఆట‌గాడు ఏదో వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న కోసం ఇంగ్లండ్ వెళ్లి అత్యాచారం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటే అంత పెద్ద విష‌యం కాక‌పోయేది. ఏకంగా పాకిస్థాన్ ఏ జ‌ట్టు త‌ర‌ఫున ఆడేందుకు వెళ్లి యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడని తేలింది.

పాక్ టి20 క్రికెట్ జ‌ట్టు స‌భ్యుడు హైద‌ర్ అలీ. 25 ఏళ్ల ఈ కుర్రాడు వ‌న్డేల్లోనూ చోటు ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు అతడు ఇంగ్లండ్ లో అరెస్ట‌య్యాడు. కార‌ణం.. అత్యా*చార ఆరోప‌ణ‌లు. పాకిస్థాన్ ఏ జ‌ట్టు త‌ర‌ఫున ఇంగ్లండ్ లో టూర్ చేస్తున్న జ‌ట్టులో స‌భ్యుడు. దీంతో అత‌డిపై వెంట‌నే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చ‌ర్య‌లు తీసుకుంది. స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ద‌ర్యాప్తు పూర్తి అయ్యేవ‌ర‌కు ఇది అమ‌ల్లో ఉంటుంద‌ని తెలిపింది.

వ‌ర్థ‌మాన క్రికెట‌ర్

ఇంగ్లండ్ ల‌య‌న్స్ (ఇంగ్లండ్- ఎ) జ‌ట్టుతో పాకిస్థాన్ -ఎ జ‌ట్టు సిరీస్ కోసం వెళ్లాడు హైద‌ర్ అలీ. బెకెన్హెయిమ్ లో జ‌రుగుతున్న సిరీస్ లో ఆడుతున్నాడు. గ‌త నెల 23న హైద‌ర్ అలీ త‌న‌పై అత్యాచా*రానికి పాల్ప‌డిన‌ట్లు ఓ యువ‌తి గ్రేట‌ర్ మాంచెస్ట‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ఈ నెల 3న హైద‌ర్ అలీని అరెస్టు చేశారు. త‌ర్వాత బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు. స‌స్పెన్ష‌న్ వేటు వేసినా.. హైద‌ర్ అలీకి న్యాయ సాయం చేసేందుకు పాక్ క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది.

ఆ యువ‌తి ఎవ‌రో?

ఇంగ్లండ్ లో హైద‌ర్ అలీపై ఫిర్యాదు చేసిన యువ‌తి వివ‌రాలు తెలియ‌రాలేదు. ఆమె పాక్ సంత‌తికి చెందిన‌దా? ఇంగ్లండ్ యువ‌తా? అన్న‌ది బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. హైద‌ర్ అలీ ఐదేళ్ల కింద‌టే.. 19 ఏళ్ల యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు పాక్ త‌ర‌ఫున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేశాడు. రెండు వ‌న్డేలు మాత్ర‌మే ఆడాడు. అయితే, 35 టీ20లు ఆడాడు. 505 ప‌రుగులు చేశాడు. మూడు హాఫ్ సెంచ‌రీలు కొట్టాడు. 27 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 1,797 ప‌రుగులు చేశాడు. ఇంకా టెస్టు అరంగేట్రం చేయ‌లేదు. హైదర్ అలీ చివర‌గా 2023 అక్టోబరు లో పాక్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

Tags:    

Similar News