ట్రంప్ నిర్ణయంతో... ఇండియాకు భారీ లాభం
అమెరికా హెచ్ 1 బీ వీసా వ్యవస్థలో తీసుకున్న మార్పులు.. ఇండియాకు అనుకూలంగా మారుతున్నాయి.;
హెచ్ 1 బీ విసా వ్యవస్థ ప్రధాన లక్ష్యం నీరుగారుతోంది. అది ఇండియాకు అనుకూలంగా మారుతోంది. అమెరికా హెచ్ 1బి వీసాను తీసుకురావడం వెనుక ఉన్న కారణం.. అమెరికాలోని కంపెనీలు విదేశాల్లో ఉన్న నిపుణులను నియమించుకోవడం కోసం. కానీ హెచ్ 1 బి వీసా వ్యవస్థలో వస్తున్న మార్పులు, అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, తరుచూ వీసాలు తనిఖీ చేయడం, ఇంటర్వ్యూలు ఆలస్యం కావడం.. ఇండియన్ టెక్ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారి ఆలోచన తీరును మార్చుతున్నాయి. ఎందుకంటే.. ఇండియాలో ఉన్న నిపుణులు ఉద్యోగం చేయడానికి అమెరికాను మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకుంటారు. అందుకే టెక్ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ రంగాల్లోని భారత నిపుణులు దశాబ్ధాలుగా అమెరికాకు వెళ్తున్నారు. కానీ ఇటీవల జరుగుతున్న మార్పులు వారిని ఆలోచింపజేస్తున్నాయి. దీంతో అమెరికా నుంచి ఇండియాకు రావాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. అమెరికా వెళ్లాలనుకున్న వారు ఇండియాలోనే ఉద్యోగం చేయాలని భావిస్తున్నారు.
ఇండియాకు ప్లస్..
అమెరికా హెచ్ 1 బీ వీసా వ్యవస్థలో తీసుకున్న మార్పులు.. ఇండియాకు అనుకూలంగా మారుతున్నాయి. చాలా మంది నిపుణులు ఇండియా నుంచే వివిధ కంపెనీలకు పనిచేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఆయా కంపెనీలు కూడా ఇండియాలో ఆఫీసులను ప్రారంభిస్తున్నారు. అమెరికన్ కంపెనీలు ఇండియాలో పనిచేయడానికి ఉద్యోగులకు అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పూణే నగరాలు ఈ మార్పును ఒడిసిపట్టుకుంటున్నాయి. అమెరికాతో పోల్చితే ఉద్యోగభద్రత, స్థిరత్వం, స్టార్టప్ కంపెనీల పెరుగుదల, ప్రపంచ స్థాయి టెక్ సంస్థలు ఇండియాలో కార్యాలయాలు ప్రారంభించడం.. ఇండియన్ నిపుణుల్లో అమెరికా పట్ల ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణం. అమెరికాలో ఇన్నాళ్లు పనిచేసిన సీనియర్ నిపుణులు ఇండియాలో సొంత స్టార్టప్ కంపెనీ ప్రారంభించడమో, లేదా వేరే కంపెనీల్లో సీనియర్ స్థాయిలో ఉద్యోగంలో చేరడమో చేస్తున్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా ఇండియాలో పనిచేస్తున్న నిపుణులకు మంచి జీతంతో పాటు అవకాశాలను కల్పిస్తున్నాయి.
ఇండియన్ టెక్ గ్రోత్ ..
ఇండియాలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం, ప్లెక్సిబుల్ వర్క్ మోడల్స్, బెటర్ ఎకోసిస్టమ్, గ్లోబల్ ఎక్సోపోజర్, స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వాల నుంచి గట్టి మద్దతు ఉండటం.. నిపుణులకు ఇండియా మంచి ఆప్షన్ గా మారింది. ఇండియాలో ఉండి కూడా పనిచేసే అవకాశాన్ని విదేశీ కంపెనీలు కల్పిస్తున్నాయి. హెచ్1బీ వీసా వ్యవస్థలో ఇదే అస్థిరత కొనసాగితే .. ఆవిష్కరణల్లో అమెరికాకు ఉన్న ఎడ్జ్ ను కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టార్టప్ కంపెనీల నుంచి ఫోర్బ్స్ 500 కంపెనీల నిర్మాణం వరకు భారత నిపుణులే కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిని కోల్పేతే అమెరికా భవిష్యత్తులో పోటీ ఇవ్వలేదు. హెచ్ 1 బీ వ్యవస్థను సులువుగా మార్చితే తప్పా అమెరికా టెక్ రంగంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.