• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విస్తరణలోనూ గ్రేటర్ కు...

విస్తరణలోనూ గ్రేటర్ కు హ్యాండిచ్చారు

| అవును.. ఎంతో ఆశగా ఎదురుచూసిన మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్ కు ఈసారీ నిరాశ తప్పలేదు.

By - Tupaki Desk
Update: 2025-06-09 05:15 GMT

అవును.. ఎంతో ఆశగా ఎదురుచూసిన మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్ కు ఈసారీ నిరాశ తప్పలేదు. రేవంత్ ప్రభుత్వంలో గ్రేటర్ ప్రాతినిధ్యం లేకపోవటం షాకింగ్ గా మారుతోంది. హైదరాబాద్ మహానగర పరిధిలో హైదరాబాద్.. రంగారెడ్డి..మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. ఈ మూడు జిల్లాలకు సంబంధించి మొత్తం 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. అందులో 25 శాతం స్థానాల వరకు ఈ మూడు జిల్లాల పరిధిలోనే ఉన్నాయి.

రాష్ట్ర జనాభాలో 40 శాతం వరకు ఈ జిల్లాల్లోనే ఉన్నారు. అలాంటి వేళ.. వీరికి ప్రాతినిధ్యం వహించేలా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించారు. కానీ.. ఈసారీ నిరాశే ఎదురైంది. రేవంత్ సర్కారులో మాత్రం కేబినెట్ లో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా ఫోకస్ చేయలేదంటున్నారు. తొలి దఫా అవకాశం లభించనప్పటికీ.. విస్తరణలో ఈ జిల్లాలకు అవకాశం ఉంటుందని భావించారు. దీనికి తోడు ఇద్దరు.. ముగ్గురు నేతలు బలంగా ప్రయత్నించారు. అయినప్పటికీ విస్తరణలో చోటు దక్కలేదు.

ఎక్కువ జిల్లాలు.. అందునా జనాభా ఎక్కువగా ఉన్న చోటు మంత్రివర్గంలో చోటు దక్కకపోవటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటం కోసం సీనియర్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రయత్నించారు. అయినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో ఆయన గుర్రుగా ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం రాత్రి ఆయన్నువ్యక్తిగతంగా కలిసి.. భవిష్యత్తులో పదవులు వస్తాయని.. వెయిట్ చేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో కానీ.. ప్రత్యేక రాష్ట్రంలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముందు వరకు గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రివర్గంలో ఖాయంగా చోటు లభించేది. అందుకు భిన్నంగా తొలిసారి ప్రాతినిధ్యం లేకుండాపోయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన హైదరాబాద్ మహానగరానికి మంత్రివర్గంలో చోటు లేకపోవటం ద్వారా.. పార్టీ బలోపేతానికి ఉండే అవకాశాల్ని పోగొట్టుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

Tags:    
  • HyderabadPolitics 
  • TelanganaCabinet 
  • RevanthReddy 
  • GHMC 
  • PoliticalNeglect 
  • TelanganaNews 
  • GreaterHyderabad 
  • CabinetExpansion 
  • TRS 
  • Congress 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS