లీటర్ పెట్రోల్ ధర రూ.2.40... ఆలసించిన ఆశాభంగం!
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత కీలకమైనవనే సంగతి తెలిసిందే.;
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత కీలకమైనవనే సంగతి తెలిసిందే. వీటి ధరల్లోని పైసల్లో తేడాలు ప్రభుత్వాలనే వణికించేసిన పరిస్థితి! భారతదేశంలో ఇంధనం ధరలు పైసల్లో పెరిగినా ఆ ప్రభావం సామాన్యుల జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తుంటుంది. అది బాగా తెలిసిన పాలకులు ఇప్పటికే సెంచరీ దాటించేశారు! ఈ క్రమంలో రూ.2.40 కి, రూ.3.60 కి లీటర్ పెట్రోల్ దొరుకుతుందంటే నమ్ముతారా?.. ఆ దేశాలూ ఉన్నాయి!
అవును... ‘లీటర్ పెట్రోల్ ధర రూ.2.40... ఆలసించిన ఆశాభంగం’ అని ఏదైనా ప్రకటన కనిపిస్తే భారతదేశంలో పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఏలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి! మాటల్లో చెప్పడం కాస్త కాదు, చాలా కష్టమే! అయితే... నిజంగా ఆ ధరకు లీటర్ పెట్రోల్ దొరుకుంది. ఇందులో భాగంగా.. ఇటీవల పశ్చిమాసియాలో యుద్ధం చేసిన ఇరాన్ లో లీటర్ పెట్రోల్ ధర రెండు రూపాయల నలభై పైసలు మాత్రమే.
అయితే.. అందుకు కారణం అక్కడ ప్రభుత్వమే ఆయిల్ ను నేరుగా ఉత్పత్తి చేస్తోంది. అంతే కాదు, సామాన్య ప్రజలకు ఇంధనం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో భారీగా సబ్సిడీలు ఇస్తోంది! ప్రపంచలోని చాలా దేశాలకు ఇంధనం అక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఇదే సమయంలో... వెనిజులా దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.3.06 గా ఉంది. అంటే... లీటర్ మూడు రూపాయల ఆరు పైసలన్నమాట. లిబియాలో రూ.2.51పైసలు!
అయితే ప్రస్తుతం మనదేశంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర సగటున రూ. 100కి పైగానే ఉంది. కొన్ని నగరాల్లో అంతకు మించి ఉంది. దీని ప్రధాన కారణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్నులే! వీటికి ఉన్న పరామీటర్స్ ఏమిటనే సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రస్తుతం పెట్రోల్ పై కేంద్రం రూ.19.90, రాష్ట్రాలు 30 - 35% వరకూ పన్నులు విధిస్తున్నాయి. ఇది ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది!
పలు నివేదికల ప్రకారం అమెరికాలోనూ పెట్రోల్ ధర దాదాపు రూ. 79.4 గా ఉండగా.. చైనాలో రూ.88.97, రష్యాలో రూ. 73.25గా ఉంది! ఈ క్రమంలో ప్రస్తుతానికి దేశంలో.. అండమాన్ లో తక్కువగా రూ.82.42కు లీటర్ పెట్రోల్ దొరుకుతుంది! ఈ క్రమంలో రూ.109.36 గా ఉండగా.. తెలంగాణలో రూ.107.46గా ఉందని తెలుస్తోంది.