గన్నవరం...గరం గరం...సడెన్ గా సీన్ లోకి యార్లగడ్డ

ఆ తరువాత మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ వచ్చే ఎన్నికల్లో తాను గన్నవరం నుంచే పోటీ చేస్తాను అని చెప్పుకొచ్చారు.

Update: 2023-07-24 16:26 GMT

విజయవాడ పరిధి లో గన్నవరం అసెంబ్లీ సీటు హీటెక్కుతోంది. ఈసారి గన్నవరం నుంచి బిగ్ పొలిటికల్ వార్ జరిగేట్టు సీన్ కనిపిస్తోంది. గన్నవరం అంటే టీడీపీ కి కంచుకోట లాంటి సీటు. అక్కడ నుంచి 2014, 2019లలో టీడీపీయే గెలిచింది. ఆ పార్టీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ కొన్నాళ్ళ తరువాత వైసీపీ లోకి దూకారు. ఆయన వచ్చిన తరువాత నుంచి వైసీపీ లో లుకలుకలు మొదలయ్యాయి.

ఇక వంశీ వైసీపీ పార్టీ వ్యక్తిగానే ముద్రపడ్డారు. ఆయనకే వచ్చే ఎన్నికల్లో టికెట్ అని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది. మరి వైసీపీ లో మొదటి నుంచి ఉన్న నాయకులు ఇద్దరు ఉన్నారు. వీరిలో యార్లగడ్డ వెంకటరావు 2014లో వంశీ మీద పోటీ చేసి ఓడారు. 2019లో దుట్టా రామచంద్రరావు పోటీ చేసి ఓడారు. వంశీ రానంతవరకూ రాజకీయంగా ప్రత్యర్ధులుగా ఒకే పార్టీలో ఉన్న ఈ ఇద్దరూ ఇపుడు ఒక్కటి అయ్యారు.

వంశీ వీరికి ప్రత్యర్ధి అయ్యారు. ఇదిలా ఉంటే చాలా కాలం తరువాత యార్లగడ్డ వెంకటరావు మీడియా కు కనిపించారు. ఆయన సోమవారం సీనియర్ నేత అయిన దుట్టా రామంచంద్రరావుతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. అయితే ఈ భేటీ సారాంశం ఏంటి అంటే వంశీకి వ్యతిరేకంగా ఇద్దరు నేతలూ చేతులు కలపాల ని డిసైడ్ అయ్యారట.

ఆ తరువాత మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ వచ్చే ఎన్నికల్లో తాను గన్నవరం నుంచే పోటీ చేస్తాను అని చెప్పుకొచ్చారు. పార్టీ ఏదో మాత్రం ఆయన చెప్పలేదు. ఇక ఒక కేసు విషయం లో కోర్టు వాయిదాకు వెళ్ళిన యార్లగడ్డ మధ్యలో హనుమాన్ జంక్షన్లో పార్టీ నేతలతో సైతం భేటీ అయ్యారు.

తాను టీడీపీ లోకి వెళ్ళబోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నుంచే పోటీ చేస్తాను అని చెప్పారు. ఒకవేళ కుదరకపోతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటాను అని అంటున్నారు.త్వరలో జగన్ తో భేటీ అవుతానని, ఆ తరువాతనే తన నిర్ణయం ప్రకటిస్తాను అని ఆయన చెప్పడం విశేషం.

మొత్తానికి చూస్తే యార్లగడ్డ పట్టుదల మీద ఉన్నారు. ఇక అనివార్య కారణాల తోనే తాను కొంతకాలం క్యాడర్ కి దూరంగా ఉన్నాను అని చెపారు. తాను వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ నుంచే పోటీ చేస్తాను అని చెబుతున్నారు. మొత్తానికి గన్నవరం రాజకీయాలలో యార్లగడ్డ తాజా స్టేట్మెంట్స్ కాక రేపుతున్నాయి.

వంశీకే టికెట్ అని చాలా సార్లు ఆయన మిత్రుడు మాజీ మంత్రి కొడాలి నాని సభల లో ప్రకటించేశారు. ఇక జగన్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా వంశీ కూడా టికెట్ తెచ్చుకుంటారనే అంతా అంటున్నారు. ఈ నేపధ్యంలో ఇండిపెండెంట్ గానైనా అని యార్లగడ్డ చెప్పడం ఆయన దుట్టా తో భేటీ కావడం ఆ ఇద్దరూ ఒక్కటి అవుతారని వార్తలు రావడం ఇవన్నీ చూస్తూంటే గన్నవరం వైసీపీ లో అగ్గి రాజుకుంది అనే అంటున్నారు. మరి దీనిని జగన్ ఎలా తీసుకుంటారో యార్లగడ్డకు ఎలా నచ్చ చెబుతారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News