గడ్డాలు, మీసాలు పెంచారని ఉద్యోగాలు ఊడగొట్టారు

అయ్యప్ప మాల ధరించినందుకు స్కూల్లోకి రానివ్వలేదు. మంగళసూత్రం ఉందని పరీక్షకు అనుమతించలేదు వంటి వార్తలు తరచూ చూస్తుంటాం

Update: 2024-05-02 08:30 GMT

అయ్యప్ప మాల ధరించినందుకు స్కూల్లోకి రానివ్వలేదు. మంగళసూత్రం ఉందని పరీక్షకు అనుమతించలేదు వంటి వార్తలు తరచూ చూస్తుంటాం. తాగొచ్చాడని ఉద్యోగం నుండి తొలగించడం, అవినీతికి పాల్పడ్డారని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయడమూ గమనించాం. కానీ గడ్డాలు, మీసాలు పెంచారని ఉద్యోగాల నుండి వార్త ఎప్పుడైనా విన్నారా ? విచిత్రంగా ఉన్నా ఇది నిజమే.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లా పర్వానూ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఓ కంపెనీ మీసం, గడ్డాలు పెంచారని 80 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యాజమాన్యంతో చర్చలకు ప్రయత్నించినా ఒప్పుకోకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. దీంతో యాజమాన్యం దిగివచ్చి గడ్డాలు, మీసాలు తొలగిస్తేనే విధుల్లోకి తీసుకుంటాం అన్న షరతు విధించింది.

యాజమాన్యం విధించిన షరతులకు అంగీకరించి వారంతా గడ్డాలు, మీసాలు తీసేసుకున్నారు. అయినప్పటికీ వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో మాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, పర్వానూ లేబర్ కమిషనర్, సోలన్ జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దీంతో కార్మికుల తొలగింపు వ్యవహారంపై సోలన్ జిల్లా కలెక్టర్ మన్మోహన్ శర్మ విచారణకు ఆదేశించారు. ఉద్యోగులను తొలగించిన దానిపై కంపెనీపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, అసలు కంపెనీ ఇలా ఎందుకు వ్యవహరించిందని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News