• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎఫ్ -35 ఫైటర్ జెట్.. ఇంకా...

ఎఫ్ -35 ఫైటర్ జెట్.. ఇంకా ఎన్నిరోజులు?

| హైడ్రాలిక్‌ వ్యవస్థలో తలెత్తిన సమస్యతో జూన్ 14న అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసిన ఈ ఫైటర్‌ జెట్‌, అప్పటి నుండి అక్కడే నిలిచివుంది.

By - Tupaki Desk
Update: 2025-07-14 19:30 GMT

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నెల రోజులుగా నిలిచిపోయిన బ్రిటన్‌ నౌకాదళానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్‌-35 ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైడ్రాలిక్‌ వ్యవస్థలో తలెత్తిన సమస్యతో జూన్ 14న అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసిన ఈ ఫైటర్‌ జెట్‌, అప్పటి నుండి అక్కడే నిలిచివుంది.

-రహస్య మరమ్మతులు

మొదటి దశలో సుమారు మూడు వారాల పాటు విమానం విమానాశ్రయంలో బహిరంగంగానే నిలిపివేయబడింది. ఆ తర్వాత, జూలై 6న దీనిని ఒక ప్రత్యేక హ్యాంగర్‌కు తరలించి మరమ్మతుల ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఇది సాధారణ మరమ్మతు కాదు. ఈ ప్రక్రియ అత్యంత రహస్యంగా, అత్యధిక భద్రత మధ్య సాగుతోంది. ఈ మరమ్మతుల కోసం బ్రిటన్ నుండి 24 మంది నిపుణుల బృందం వచ్చింది. వీరిలో 14 మంది సాంకేతిక నిపుణులు కాగా, మిగిలిన 10 మంది విమాన క్రూ సభ్యులు. ఈ బృందం ఎఫ్‌-35లో తలెత్తిన హైడ్రాలిక్ లోపాన్ని పరిష్కరించేందుకు నిత్యం కృషి చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సంతృప్తికరమైన ఫలితం రాలేదు.

-ఆస్ట్రేలియాకు బయలుదేరి...

ఈ ఫైటర్‌ జెట్‌ అసలు గమ్యం ఆస్ట్రేలియాగా తెలుస్తోంది. మార్గ మధ్యలో ఇంధన సమస్యలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎదురుకావడంతో పైలట్ అత్యవసరంగా సమీప విమానాశ్రయమైన తిరువనంతపురంలో ల్యాండ్ చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఈ యుద్ధవిమానం తిరిగి గాల్లోకి లేచిన దాఖలాలు లేవు. ప్రస్తుతం విమానం చుట్టూ బ్రిటిష్‌ భద్రతా సిబ్బంది ముమ్మర నిఘా పెట్టారు. భారతీయ సిబ్బంది విమానం నుండి దూరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రహస్యతే ఈ విమానానికి మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

- విడిభాగాలుగా తరలిస్తారా?

సాంకేతిక మరమ్మతులు ఫలించకపోతే, ఎఫ్‌-35ని విడిభాగాలుగా విభజించి, భారీ ట్రాన్స్‌పోర్ట్ విమానం సీ-17 గ్లోబ్‌ మాస్టర్ ద్వారా తిరిగి బ్రిటన్‌కు తరలించే అవకాశముంది. దీన్ని అమలు చేయగలిగేది కేవలం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థకు చెందిన ప్రత్యేక ఇంజినీర్లే. ఈ పరిణామాలతో భారత విమానాశ్రయ చరిత్రలోనే ఒక అరుదైన ఘటనగా ఎఫ్‌-35 నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో దీని మరమ్మతులు పూర్తవుతాయా? లేక దీన్ని విదేశాలకు తరలించాల్సి వస్తుందా? అన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ పరిస్థితి ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.

Tags:    
  • F35Jet 
  • KeralaAirport 
  • UKFighterJet 
  • AviationNews 
  • TrivandrumIncident 
  • LockheedMartin 
  • MilitarySecrets 
  • DefenseWatch 
  • EmergencyLanding 
  • AerospaceUpdates 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS