పుండు మీద కారం చల్లినట్లుగా తుర్కియే అధ్యక్షుడి తాజా వ్యాఖ్యలు!

ఇంత జరుగుతున్నా.. వాటిని పట్టించుకునే దశలో తుర్కియే దేశాధ్యక్షుడు లేడన్నట్లుగా అతడి తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.;

Update: 2025-05-15 04:59 GMT

మిత్రుడి మేలు కోరే స్నేహితుడి తపనను అర్థం చేసుకోవచ్చు. కానీ.. అధర్మంగా ఒక దేశాన్ని ఉగ్రదాడులతో గురి పెట్టి అమాయక ప్రజల ప్రాణాల్ని అత్యంత కిరాతకంగా చంపేస్తూ మారణహోమాన్ని స్రష్టించే దేశానికి మద్దతు ఇచ్చేందుకు ఏ దేశం ముందుకు రాదు. కానీ.. అందుకు భిన్నంగా తుర్కియే మాత్రం పాక్ కు సాయం అందించేందుకు.. అండగా నిలిచేందుకు చూపిస్తున్న తపన చూస్తే.. ఆ దేశం సంగతిని చూడాల్సిన అవసరం ఉందన్న భావన కలిగేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి.

ఇప్పటికే బాయ్ కాట్ తుర్కియే నినాదం నడుస్తోంది. ఆ దేశ ఉత్పత్తుల్ని వాడేందుకు భారతీయులు ఆసక్తి చూపటం లేదు. ఆ దేశానికి వెళ్లే భారత పర్యాటకులు తమ ప్లాన్లను క్యాన్సిల్ చేసుకోవటం తెలిసిందే. ఇంత జరుగుతున్నా.. వాటిని పట్టించుకునే దశలో తుర్కియే దేశాధ్యక్షుడు లేడన్నట్లుగా అతడి తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.

పాక్ కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెబుతున్నారు. తాజాగా మాట్లాడిన ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగన్ సాక్ తమ నిజమైన మిత్ర దేశంగా అభివర్ణించారు. ‘మా దేశాల సోదర భావం నిజమైన స్నేహానికి నిదర్శనం. పాక్ - తుర్కియే దోస్తీ జిందాబాద్’ అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు విన్న భారతీయులకు పుండు మీద కారం జల్లినట్లుగా ఉంటోంది. ఈ క్రమంలో తుర్కియే ను ఇప్పటివరకు భారత ప్రజలు మాత్రమే స్పందించారని.. భారత సర్కారు కూడా ఆ దేశం సంగతి చూసేలా దౌత్యకార్యక్రమాలు నడపాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి.

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా చేపట్టిన దాడులతో పాక్ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తెలిసిందే. అయినప్పటికీ.. తుర్కియే అధ్యక్షుడి ఓవరాక్షన్ సంగతి చూడాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా భారత మిత్రదేశాలతో కలిసి.. తుర్కియే మీద ఒత్తిడిని పెంచటమే కాదు.. ఆ దేశాధ్యక్షుడ్ని న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News