ఆరు జాతీయ పార్టీలు మాత్రమేనట....వాటి మీద వేటు
ఇక జాతీయ పార్టీలు కానివి అన్నీ ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర పార్టీల జాబితాలోకి వస్తాయి. ఆ విధంగా చూస్తే కనుక దేశంలో మొత్తం 67 దాకా ఉన్నాయి.;
కేంద్ర ఎన్నికల సంఘం భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. ఏకంగా వందల కొద్దీ పార్టీల మీద ఒక్క వేటు వేసింది. అదే సమయంలో జాతీయ పార్టీల జాబితాను ప్రకటించింది. అలా ఈసీ గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు చూస్తే కేవలం ఆరు మాత్రమే మిగిలాయి. ఆ లిస్టులో బీజేపీ కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి. మిగిలినవి అన్నీ జాతీయ పార్టీలు కావని తేల్చేసింది.ఈ క్రమంలో సీపీఐకి జాతీయ హోదా లేకుండా పోయింది.
అవన్నీ ఇక రద్దు :
ఈసీ నియమ నిబంధనల ప్రకారం చూస్తే వాటిని ఏ మాత్రం పాటించని వందలాది పార్టీల మీద ఈసీ వేటు వేసింది. ఆ నంబర్ పెద్దదిగా ఉంది. 334 పార్టీలు రిజిష్టర్డ్ పార్టీలుగా ఉన్నాయి. ఇవన్నీ గత ఆరేళ్ళుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో పాటు పెద్దగా క్రియాశీలకంగా లేవని భావించి ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రిజిష్టర్డ్ పార్టీలుగా మరో 2854 పార్టీలు ఉన్నాయి. ఇవి కూడా సక్రమంగా లేకపోతే వేటు తప్పదని అంటున్నారు.
రాష్ట్ర పార్టీలు ఇవే :
ఇక జాతీయ పార్టీలు కానివి అన్నీ ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర పార్టీల జాబితాలోకి వస్తాయి. ఆ విధంగా చూస్తే కనుక దేశంలో మొత్తం 67 దాకా ఉన్నాయి. ఇవన్నీ ఈసీ గుర్తింపు పొంది సొంత గుర్తులు కలిగిన పార్టీలు ఈ పార్టీలు అన్నీ ఎన్నికల్లో పోటీ చేయడం తమ కార్యవర్గాలను ఎప్పటికపుడు ప్రకటించడం తన నిధులు విరాళాల గురించి వివరాలు ఇవ్వడం చేస్తూ వస్తున్నాయి. ఈ నిబంధనలు పాటించని పార్టీల మీద కూడా వేటు ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.
తెలుగు నాట ఇదీ లిస్ట్ :
ఈసీ తాజాగా విడుదల చేసిన దాని ప్రకారం చూస్తే తెలుగు నాట రెండు రాష్ట్రాలలో ప్రముఖంగా మూడంటే మూడు జాతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి. అవి బీజేపీ కాంగ్రెస్ సీపీఎం గా చెబుతున్నారు. ఇక ఆప్ బీఎస్పీ, ఎన్సీపీ ఎన్నికల్లో అపుడపుడు పోటీ చేసినా పెద్దగా ఉనికిలో లేవన్నది తెలిసిందే అంటున్నారు. అదే విధంగా ప్రాంతీయ పార్టీలుగానే తెలుగుదేశం బీఆర్ఎస్ ఉన్నాయి. బీఆర్ఎస్ ని జాతీయ పార్టీగా చేయాలని ఏకంగా పేరు కూడా కేసీఆర్ మార్పు చేసినా ఫలితం లేకుండా పోయి తెలంగాణాలోనే ఓటమి సంభవించింది.
ఇక తెలుగుదేశం జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నా ప్రాంతీయ పార్టీగా ఈసీ వద్ద ఉంది. అలాగే వైసీపీ జనసేన సైతం ఈసీ వద్ద ప్రాంతీయ పార్టీలుగానే ఉన్నాయి. సీపీఐ జాతీయ పార్టీ హోదా కోల్పోయింది. ఒకనాడు జాతీయ పార్టీగా ఉన్నా కూడా ఇపుడు గెలుపు కోసం పోరాడుతోంది. మొత్తం మీద చూస్తే ప్రాంతీయ పార్టీలుగా ఇవే ఉన్నాయి. గుర్తింపు పొందని పార్టీలు అనేకం కనిపిస్తున్నాయి.