• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దువ్వాడ ఉత్సవం...జంటగా...

దువ్వాడ ఉత్సవం...జంటగా హుషారుగా !

| వైసీపీ ఎమ్మెల్సీ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కీలక నేత దువ్వాడ శ్రీనివాస్ కో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-10-07 14:15 GMT

వైసీపీ ఎమ్మెల్సీ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కీలక నేత దువ్వాడ శ్రీనివాస్ కో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆయన తన అనుచరురాలు వైసీపీ మహిళా నేత మాధురితో కలసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. ఏడుకొండల స్వామిని ఈ జంట దర్శించుకున్నారు. వీరి వెంట టెక్కలికి చెందిన వైసీపీ నేతలు కూడా ఉన్నారు

ఈ సందర్భంగా మీడియాకు ఎదురుపడి వారి ముందు చిరునవ్వులు చిందిస్తూ దువ్వాడ శ్రీనివాస్ కనిపించారు. దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రెండు నెలల క్రితం ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. తన భార్య వాణి కుమార్తెతో ఆయన విభేదించిన తీరుతో పాటు ఆయన టెక్కలి హైవే మీద కట్టిన కొత్త ఇల్లు తమదే అంటూ వారు రచ్చ చేయడంతో కొన్నాళ్ళ పాటు మీడియాకు అదే వార్త అయింది

అయితే మాధురికి తాను రెండు కోట్ల రూపాయలు బాకీ పడ్డాను అని ఆ ఇంటికి ఆమె పేరున శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ చేయించడంతో ఆ ఇల్లు ఆమె పరం అయింది. దాంతో ఆ వివాదం ఆగిపోయింది. మరో వైపు చూస్తే తన భార్యకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా ఆయన మీడియా ముందే ప్రకటించారు. సో ఆ విషయం పక్కన పెడితే వైసీపీ మహిళా నేత మాధురితో కలసి ఆయన తాజాగా మీడియా ముందు కనిపించడంతో ఆయన సంచలనంగా మారారు.

రానున్న రోజులలో కీలక వార్త ఏదైనా చెబుతారా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక వైసీపీ నేత దువ్వాడ డేరింగ్ లీడర్ అని మహిళా నాయకురాలు మాధురి చెబుతూ ఉంటారు. ఆయనని హీరోగా పెట్టి ఆమె వాలంటీర్ అన్న సినిమా ఇటీవల తీశారు అని అంటున్నారు.

ఇలా దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలసి బయటకు రావడం ఆయన భార్య కుమార్తెలు ఈ ఇష్యూ విషయంలో ఒక లాజికల్ ఎండింగ్ కోసం చూస్తున్నట్లుగా సైలెంట్ కావడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇష్యూలో ఓపెన్ అయ్యారని అందుకే మీడియా ముందుకు వచ్చారని అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం కూడా దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కఠినంగా వ్యవహరించడం లేదు. ఆయనను టెక్కలి ఇన్చార్జి పదవి నుంచి మాత్రమే తప్పించింది. ఆయన ఎమ్మెల్సీ పదవి అలాగే ఉంది. ఆయన ఈ మధ్య వైసీపీ నిర్వహించిన జిల్లా స్థాయి పార్టీ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. దాంతో రానున్న రోజులలో ఆయన పార్టీ పరంగా మళ్లీ కీలకం కానున్నారు అని అంటున్నారు.

ఏది ఏమైనా దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ గా దూకుడు కలిగిన నాయకుడు. ఆయన ఇటీవల కాలంలో వ్యక్తిగత వివాదాల్లో పడి కాస్తా పొలిటికల్ గా వెనకబడ్డారు ఇపుడు మరీ సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తూ మీడియాకు వచ్చారు. రానున్న రోజులలో ఆయన యధా ప్రకారం వైసీపీ తరఫున తన సత్తాను చూపుతారు అని అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా ఆరు పదుల వయసులో ఉన్నా నవ యువకుడిగా దువ్వాడ కనిపిస్తున్నారు అని ఆయన ఫ్యాన్స్ అంటోంది. ఆయనలో ఉత్సాహం హుషారుని వారు ఆస్వాదిస్తున్నారు.

Tags:    
  • Duvvadasrinivas 
  • Madhuri 
  • YSRCP 
  • Ycpmla 
  • Duvvadasrinivasmadhuri 
  • Tirumalatemple 
  • Divvalamadhuri 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS