'డ్రీమ్ ఫోక్స్'కు దిగ్గజ బ్యాంకులు బైబై!
చాలా బ్యాంకులు తాము జారీ చేసే డెబిట్.. క్రెడిట్ కార్డుల్ని ఉచితంగా ఈ లాంజ్ లలో వినియోగించేలా ప్లాన్లను ఆఫర్ చేస్తుంటాయి.;
తరచూ విమాన ప్రయాణాలు చేసే వారికి ఎయిర్ పోర్టుల్లోని లాంజ్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎయిర్ ట్రావెల్ చేసే వారంతా ఈ లాంజ్ లలో సేద తీరుతూ.. తమకు నచ్చిన ఫుడ్ ను ఫ్రీగా తినేస్తుంటారు. దీనికి తమ వద్ద ఉన్న క్రెడిట్ కార్డులు.. డెబిట్ కార్డుల్ని వినియోగిస్తూ ఉండటం తెలిసిందే.
చాలా బ్యాంకులు తాము జారీ చేసే డెబిట్.. క్రెడిట్ కార్డుల్ని ఉచితంగా ఈ లాంజ్ లలో వినియోగించేలా ప్లాన్లను ఆఫర్ చేస్తుంటాయి. అయితే.. ఎయిర్ పోర్టుల్లో లాంజ్ సేవల్ని ఈ బ్యాంకులు నేరుగా అందించవు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఆ కోవలోకే వస్తుంది డ్రీమ్ ఫోక్స్. ఈ సంస్థ నిర్వహించే లాంజ్ లకు మంచి పేరు ఉంది. దేశీయంగా డ్రీమ్ ఫోక్స్ కు 34 ఎయిర్ పోర్టుల్లో 49 లాంజ్ సర్వీసుల్ని అందిస్తూ ఉంటుంది. లిస్టెడ్ కంపెనీ అయిన ఈ సంస్థ.. ఇటీవల కాలంలో పలు ఫిర్యాదులు తెర మీదకు వస్తున్నాయి.
దిగ్గజ బ్యాంకులైన ఐసీఐసీఐ.. యాక్సిస్ లాంటి పలు సంస్థలు ఈ సంస్థతో లాంజ్ సేవల కోసం టై అప్ చేసుకున్నాయి. గత ఏడాది పలు విమానాశ్రయాల్లో లాంజ్ సేవల్ని అందించే విషయంలో ఈ సంస్జపై పలువురు ఫిర్యాదులు చేసిన పరిస్థితి. గత ఏడాది సెప్టెంబరు 22న ఈ సంస్థ తన లాంజ్ సేవల్ని అందించే విషయంలోఫెయిల్ కావటం.. వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
ఈ నేపథ్యంలో ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందాల్ని ముగించుకునే దిశగా పలు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. అయితే.. దీనికి ప్రత్యామ్నాయంగా లాంజ్ సేవల్ని అందించే సంస్థల కోసం పలు బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయి. అదే జరిగిత.. డ్రీమ్ ఫోక్స్ కు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు. తనకు జరిగే నష్టాన్ని ఈ సంస్థ ఎలా అధిగమిస్తుందో చూడాలి.