• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'డీప్ సీక్' పై అమెరికా...

'డీప్ సీక్' పై అమెరికా కీలక నిర్ణయం... ఇజ్రాయెల్ షాకింగ్ కామెంట్స్!

| చైనాలో 2023లో లియాంగ్ వెన్ ఫెంగ్ అనే వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సంస్థ ‘డీప్ సీక్’ ను ప్రారంభించారు.

By - Tupaki Desk
Update: 2025-01-30 20:30 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ అనతికాలంలోనే ప్రాచుర్యం పొందడం.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి సంస్థలు ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఏఐలో అమెరికా ఆధిపత్యం చలాయిస్తూ వస్తోన్న వేళ.. ఒక్కసారిగా తెరపైకి వచ్చి, సంచలనం సృష్టించింది డీప్ సీక్ ఏఐ అనే సంగతి తెలిసిందే.

చైనాలో 2023లో లియాంగ్ వెన్ ఫెంగ్ అనే వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సంస్థ ‘డీప్ సీక్’ ను ప్రారంభించారు. ఈ సమయంలో ఇటీవల.. ఎన్విడియాతో పోలిస్తే తాము చాలా తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్ తోనే ఏఐ మోడల్స్ ని రూపొందించామని చెప్పడంతో అమెరికా మార్కెట్ లో లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి.

ఫలితంగా... రెండు రోజుల క్రితం ఎన్విడియా మార్కెట్ విలువలో $593 బిలియన్ల సంపద ఆవిరైంది. అంటే... భారత కరెన్సీలో అక్షరాలా రూ. 51 లక్షల కోట్లన్నమాట. ఇదే సమయంలో... అటు మైక్రోసాఫ్ట్, మెటా షేర్లు కూడా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో డీప్ సీక్ ఏఐ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... అమెరికా జాతీయ భద్రత పేరు చెప్పిన ఇటీవల టిక్ టాక్ పై నిషేధం వార్తలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. అమెరికా జాతీయ భద్రతపై డీప్ సీక్ ఏఐ చూపే ప్రభావాలను పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ మేరకు శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో... డీప్ సీక్ వృద్ధిలో ప్రాపర్టీ థెఫ్ట్ జరిగి ఉండవచ్చని డొనాల్డ్ ట్రంప్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టో కరెన్సీ సలహాదారు డెవిడ్ సాక్స్ సందేహిస్తున్నారు. ఏఐలో డిస్టిలేషన్ అనే టెక్నిక్ ఉందని.. దీని ద్వారా ఏఐ మోడల్ మరో మోడల్ నుంచి నేర్చుకుంటుందని.. ఇదే డీప్ సీక్ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ అయ్యి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోపక్క.. డీప్ సీక్ ఆర్1 మోడల్ విడుదల సంచలనంగా మారిన వేళ ఆ సంస్థకు సంబంధించిన పలు కీలక విషయాలను ఇజ్రాయెల్ కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ విజ్ పేర్కొంది. డీప్ సీక్ చాలా సున్నితమైన డేటాను ఓపెన్ ఇంటర్నెట్ కు చేరవేస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. దీంతో... ఒక్కసారిగా ఈ విషయం షాకింగ్ గా మారిందని అంటున్నారు.

ఈ సందర్భంగా తన బ్లాగ్ లో దీనికి సంబంధించి ఓ పోస్ట్ చేసింది విజ్. ఈ సందర్భంగా స్పందిస్తూ.. సుమారు ఒక మిలియన్ కు పైగా లైన్ల డేటాను డీప్ సీక్ సేఫ్ గా స్టోర్ చేయకపోవడంతో ఆ సమాచారం బయటకు వచ్చిందని.. వాటిలో యూజర్స్ చాట్ లాగ్స్, డిజిటల్ సాఫ్ట్ వేర్ కీస్ వంటివి ఉన్నాయని తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన విజ్ సహ వ్యవస్థాపకులు అమీ లుత్వాక్... ఆ సంస్థ నుంచి చాలా సున్నితమైన డేటా ఓపెన్ ఇంటర్నెట్ కు చేరిన విషయాన్ని గుర్తించామని.. ఈ విషయంపై తన సంస్థ వారిని అప్రమత్తం చేసిన గంటలోనే డీప్ సీక్ డేటాను భద్రపరిచిందని తెలిపారు. అయితే... ఈ విషయాలపై డీప్ సీక్ సంస్థ నుంచి ఇంకా స్పందన రాలేదు!

Tags:    
  • DeepSeekAI 
  • DeepSeek 
  • AI 
  • ArtificialIntelligence 
  • Nvidia 
  • Microsoft 
  • Meta 
  • China 
  • AImodels 
  • AIresearch 
  • Cybersecurity 
  • DavidSachs 
  • Databreach 
  • DeepSeekR1model 
  • Openinternet 
  • Sensitivedata 
  • WhiteHouse 
  • Nationalsecurity 
  • AIdistillationtechnique 
  • CybersecurityfirmWiz 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS