• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జైల్ గార్డెన్ లో కుర్చీలో...

జైల్ గార్డెన్ లో కుర్చీలో కూర్చొని.. కాఫీ కప్పుతో దర్శన్ దర్జా శిక్ష

| తన ప్రియురాలు కం నటి పవిత్ర గౌడకు తన వీరాభిమాని రేణుకాస్వామి అశ్లీల ఫోటోలు పంపుతున్నారన్న కసితో అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో హీరో దర్శన్ జైల్లో ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-26 04:35 GMT

ఎవరెన్ని చెప్పినా.. డబ్బులు.. ప్రముఖుడన్న ట్యాగ్ ఉండాలే కానీ ఎంతటి తీవ్రమైన నేరం చేసినా వారికి దొరికే సౌకర్యాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. హత్య కేసులో జైల్లో ఉన్న శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ రాజసం చూస్తే నోటి వెంట మాట రాదంతే. ఓవైపు బెయిల్ కోసం సదరు అగ్ర నటుడి భార్య ప్రయత్నిస్తున్న వేళ.. బయటకు వచ్చిన ఫోటో సంచలనంగా మారటమే కాదు.. రాచమర్యాదల్ని చూసినోళ్లు అవాక్కు అవుతున్నారు.

సొంతింట గార్డెన్ లో ఎంత థిలాసాగా కూర్చొని కాఫీ తాగుతూ సేద తీరుతారో.. ఆ ఫీల్ కు ఏ మాత్రం తక్కువ లేకుండా జైలు గార్డెన్ లో కుర్చీలో కూర్చొని.. కాఫీ తాగటమే కాదు.. మరో చేత్తో విలాసంగా సిగిరెట్ తాగుతూ.. చుట్టూ తన మనుషులతో మాటలు చెప్పుకుంటూ సేద తీరుకు.. అవాక్కు అవ్వాల్సిందే. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తన ప్రియురాలు కం నటి పవిత్ర గౌడకు తన వీరాభిమాని రేణుకాస్వామి అశ్లీల ఫోటోలు పంపుతున్నారన్న కసితో అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో హీరో దర్శన్ జైల్లో ఉన్నారు. ఈ హత్య కేసులో ఏ1గా వ్యవహరిస్తున్న దర్శన్ తోపాటు మరికొందరిని జైలుకు పంపారు. ప్రస్తుతం వారు కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. శిక్ష అనుభవిస్తున్న రిమాండ్ ఖైదీగా ఉండాల్సిన చోట.. ఇంటి అల్లుడ్ని ఏ రీతిలో అయితే రాచమర్యాదలు చేస్తారో.. ఇంచుమించు అదే స్థాయిలో జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నాయి.

దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ చేతిలో కాఫీ కప్పు.. మరో చేతిలో సిగిరెట్ తాగుతూ రిలాక్స్ అవుతున్న వైనం చూసినోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వైరల్ ఫోటోలో దర్శన్ తో పాటు.. రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ, మరో ఖైదీ కూడా ఉన్నారు. ఈ ఫోటోను అదే జైల్లో ఉన్న ఒక ఖైదీ తన భార్యకు పంపగా.. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ అయ్యింది.

ఈ నేపథ్యంలో జైల్లో నిబంధనల్ని అమలుపై కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. మొత్తానికి జైల్లో ఉన్నప్పటికీ.. రాచమర్యాదలకు ఏ మాత్రం కొదవ లేకుండా చూసుకుంటున్న జైలు అధికారుల తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోతో జైలు అధికాులు ఆత్మ రక్షణలో పడినట్లుగా తెలుస్తోంది. అయితే.. వారి నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే ఇప్పటివరకు రాలేదు. దీనికి ఎలాంటి కవరింగ్ ఇస్తారన్న దానిపై బోలెడంత మంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

Tags:    
  • Darshan 
  • Jail 
  • Bangalore 
  • Pavithragowd 
  • Court 
  • Police 
  • Renukswamy 
  • Renukswamycase 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS