• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చౌరస్తాలో దానం నాగేందర్ !

చౌరస్తాలో దానం నాగేందర్ !

| ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ ఇంటిని కాంగ్రెస్ పార్టీ ముట్టడించే ప్రయత్నాన్ని తప్పుపట్టిన ఏకైక ఎమ్మెల్యే దానం నాగేందర్.

By - Garuda Media
Update: 2026-09-15 14:30 GMT

శాసనసభ సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం నల్ల టీ షర్టులతో సభకు హాజరవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది. ఈ సంధర్భంగా జరిగిన గొడవ, వ్యాఖ్యలకు కారణం కేసీఆర్ అని, దానికి ఆయన క్షమాపణ చెప్పాలని, ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ముట్టడికి పిలుపునిచ్చింది. అటు బీఆర్ఎస్ శ్రేణుల ప్రతిఘటన, ఇటు కాంగ్రెస్ శ్రేణుల ప్రతిఘటన నేపథ్యంలో కేసీఆర్ నివాసం ముట్టడి హాట్ హాట్ గా సాగింది.

ఈ సంధర్భంగా కాంగ్రెస్ నేతలు ఎర్రవల్లి ముట్టడికి రావడాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ది చేశారు. దళితులు ఎర్రవల్లికి వచ్చారు కాబట్టే దళితులు రావడాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పసుపు నీళ్లు చల్లించిందని కాంగ్రెస్ మరో వివాదాన్ని రేపింది. ఏకంగా దీనిపై ప్రభుత్వం ఓ విచారణ కమిటీ కూడా వేయడం, అది విచారణ చేయడం కూడా జరుగుతుంది.

ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ ఇంటిని కాంగ్రెస్ పార్టీ ముట్టడించే ప్రయత్నాన్ని తప్పుపట్టిన ఏకైక ఎమ్మెల్యే దానం నాగేందర్. ‘వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలి. అంతేగానీ ఇలా ఇంటి మీదకు దాడికి వెళ్లడం మంచి పద్దతి కాదు’ అని దానం అనడం గమనార్హం. ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అందులో చేరిపోయారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మొదటి వ్యక్తి దానం కావడం గమనార్హం. అంతే కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేయడం కూడా జరిగింది. ఆయన మీద అనర్హత పిటీషన్ ప్రస్తుతం కోర్టులో పెండింగులో ఉంది. అయితే గత కొన్నాళ్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో పొసగ లేక పోతున్నట్లు చెబుతున్నారు.

శాసనసభలో నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి నేను తలచుకుంటే ఒక్కరూ బయట తిరగరు అని దానం హెచ్చరించారు. అదే సమయంలో ‘కేసీఆర్ ప్రతి విషయం ఇంటి నుండే సునిశితంగా పరిశీలిస్తారని, ఆయన మీద తనకు అపార గౌరవం ఉందని, కేటీఆర్, హరీష్ రావులు సమర్దులు తెలివైన నేతలు’ అని దానం అన్నారు.

కొద్ది రోజుల క్రితం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ కొమరంభీమ్ ఆదివాసి భవన్లో ఇందిరమ్మ టవర్స్ లబ్దిదారుల డ్రా సంధర్భంగా దానం వెళ్లకముందే అధికారులు డ్రా కార్యక్రమం పూర్తి చేయడంతో అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన అని, ప్రివిలేజ్ నోటీస్ ఇస్తానని హెచ్చరించాడు.

గతంలోనూ టికెట్ దొరకక కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరి, గెలిచిన తరువాత వైఎస్ గెలిచి, ముఖ్యమంత్రి కావడంతో, మళ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర దానం నాగేందర్ కు ఉంది. తాజాగా ఆయన బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో కొనసాగుతున్నాడు. అనర్హత వేటు అంశం కోర్టు పరిధిలో ఉండడం, ప్రభుత్వం నుండి అనుకున్నంత సహకారం లభించక పోవడంతో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ తలుపులు మూసుకున్న నేపథ్యంలో దానం రాజకీయ భవిష్యత్తు తిరిగి చౌరస్తాకు చేరినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    
  • danamnagender 
  • kcr 
  • brs 
  • congress 
  • telanganapolitics 
  • tgnews 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS