బాంబుల నుంచి గులకరాయికి.. స్టార్ట్ చేసిన సీపీఐ నారాయణ!

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అయినా కూడా అది భౌతిక దాడిగా ఉండకూడదని నొక్కి చెబుతున్నారు

Update: 2024-04-21 07:04 GMT

ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడి హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. పైగా దాడికి పాల్పడిన కేసులో టీడీపీ కార్యకర్త పేరు తెరపైకి రావడంతో ఇది మరింత చర్చనీయాంశం అయ్యి.. రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో అది గులకరాయి దాడని విపక్షాలు ఎద్దేవా తరహాలో మాట్లాడుతుంటే... అది హత్యాయత్నం పరిధిలోకి వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. దాడి ఏదైనా దాడే కాబట్టి అంతా ఖండించాల్సిందే అని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అయినా కూడా అది భౌతిక దాడిగా ఉండకూడదని నొక్కి చెబుతున్నారు. ఇది ఏమాత్రం ఆహ్వానించదగ్గ సంస్కృతి కాదని నొక్కి చెబుతున్నారు. ఈ సమయంలో కమ్యునిస్టులు ఎంటరయ్యారు. ఇందులో భాగంగా.. వైఎస్ షర్మిళ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న కమ్యునిస్టులు ఈ విషయంపై స్పందించారు. ఈ క్రమంలో... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జగన్ పై జరిగిన దాడిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

అవును... జగన్ పై జరిగిన దాడిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా... జగన్ పై జరిగిన దాడిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బాంబులు వేసుకునే సంస్కృతి నుంచి గులక రాయికి వచ్చారని ఆయన సెటైర్లు పేల్చారు. జగన్ పై జరిగిన దాడికి గులకరాయి దాడి అనే పేరొచ్చిందని, అలా ఏపీ రాజకీయాలు అపహాస్యంపాలయ్యాయని తనదైన విశ్లేషణ చేశారు! ప్రజలకు గులకరాయి కథలు అంతా తెలుసని చెప్పుకొచ్చారు.

Read more!

ఈ సమయంలో... పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళ్లకు కట్టు కట్టుకుని తిరిగారని, ఇక్కడ జగన్ కళ్లకు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో పోలీసులపైనా అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. ఇందులో భాగంగా... రాయి వేసిన వారిని కాకుండా.. ఉద్దేశ పూర్వకంగా మరొకరిని ఇరికించాలని పోలీసులు చూస్తున్నారని ఆరోపించారు! దీంతో.. ఈ కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇందులో భాగంగా... ఎన్డీయే కూటమికి వ్యతిరేకం అని చెప్పే కమ్యునిస్టులు కూడా... పాత పసుపు వాసనలు పోగొట్టుకోలేకపోతున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలు ఏపీలో మాత్రం బాబుకి భజన చేస్తున్నాయంటూ ఎద్దేవా చేస్తున్నారు. కేంద్రంలో అధికారం కోసం ఫైట్ చేస్తున్న ఎన్డీయే, ఇండియా కూటములు.. ఏపీలో మాత్రం జగన్ కి వ్యతిరేకం గా పరస్పర సహకారం అందించుకుంటున్నాయంటూ కొత్త కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News