సైలెంట్ వార్: ఎమ్మెల్యేలతో సీఎం భేటీ
అయితే.. కొందరు లైన్‌లోకి వస్తున్నా.. చాలా మంది ఎమ్మెల్యేలు లైన్‌లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి సైలెంట్‌గా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు.;
కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఎలా ఉ న్నారు? అంటే.. ఆయన తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. క్షేత్రస్థాయిలో అన్యా యాలు... అక్రమాలు.. ఇసుక, మద్యం వ్యాపారాల పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రజలకు చేరువ కావడంలోనూ.. ప్రభుత్వం తరఫున ప్రచారం చేయడంలోనూ.. ఎమ్మెల్యేలు వెనుకబడుతున్నారన్నది ప్రధానంగా సీఎం చంద్రబాబు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే ఆయన పదే పదే వారిని హెచ్చరిస్తున్నారు.
అయితే.. కొందరు లైన్‌లోకి వస్తున్నా.. చాలా మంది ఎమ్మెల్యేలు లైన్‌లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి సైలెంట్‌గా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. అదే.. వన్-టు-వన్ భేటీలు. ఇప్పటి వరకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న 32 మంది ఎమ్మెల్యేలను రహస్యం గా పిలిపించుకుని అమరావతి సచివాలయంలోనే వారితో చర్చించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఒక్కొక్కరితోనూ.. ఐదేసి నిమిషాల చొప్పున చంద్రబాబు చర్చించారు.
వారి నియోజకవర్గంలో ఐవీఆర్ ఎస్ సర్వేల ద్వారా వచ్చిన ఫలితాలు.. వారు చేస్తున్న వ్యాపారాలపై పెట్టిన నిఘా వంటివాటిని ఎమ్మెల్యేలకు చూపించి.. ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని.. ఇప్పటి నుంచి ప్రజలకు చేరువ కావాలని.. దూకుడు తగ్గించి.. ప్రజల్లో ఉండాలని కొందరు చెబుతున్నారు. మరికొందరికి కూటమి పార్టీలతో సఖ్యత ముఖ్యమని.. అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. ఇదంతా అత్యం తసైలెంట్‌గా సాగుతోంది.
అయితే.. చంద్రబాబు గతంలోనూ ఇలా కొందరిని పిలిచి క్లాస్ ఇచ్చారు. మరికొందరిని పల్లా శ్రీనివాసరావు దగ్గరకు కూడా పంపించారు. అయితే.. వారిలో పెద్దగా మార్పురాలేదు. పార్టీ క్రమశిక్షణ సంఘం హెచ్చరిం చిన ఎమ్మెల్యేలు కూడా దారిలోకి రాలేదు. దీంతో ఇదే చివరి.. చర్చలుగా పార్టీలో నాయకులు వ్యాఖ్యానిస్తు న్నారు. అంటే.. ఇకపై చర్చలు ఉండవని.. వారిపై చర్యలే ఉంటాయన్న సంకేతాలు పంపుతున్నారు. మరి ఇప్పటికైనా నాయకులు మార్పు దిశగా అడుగులు వేస్తారా? లేదా? అనేది చూడాలి.