• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గిన్నిస్ రికార్డ్ దిశగా...

గిన్నిస్ రికార్డ్ దిశగా కుంభమేళా... భక్తుల విషయంలో కాదు!

| చివరిరోజు కూడా కావడంతో తాకిడి ఎక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు. మరోపక్క.. గిన్నిస్ రికార్డ్ దిశగా ఇక్కడ ఓ కార్యక్రమం జరగనుంది.

By - Tupaki Desk
Update: 2025-02-25 05:53 GMT

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 13 నుంచి మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్లుగా ఈ మహా కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు, పర్యాటకులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ పవిత్ర త్రివేణి సంగమంలో సుమారు 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు చెబుతున్నారు.

ఈ నెల 26వరకూ ఈ మహాకుంభమేళా కార్యక్రమం కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం రావడంతో భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో.. చివరిరోజు కూడా కావడంతో తాకిడి ఎక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు. మరోపక్క.. గిన్నిస్ రికార్డ్ దిశగా ఇక్కడ ఓ కార్యక్రమం జరగనుంది.

అవును... ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకూ సుమారు 60 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది! ఈ నేపథ్యంలోనే గిన్నీస్ రికార్డ్ లక్ష్యంగా పారిశుధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ ను నిర్వహించారు.

ఇందులో భాగంగా... సుమారు 15 వేల మంది కార్మికులు చీపురు పట్టి ఈ క్లీన్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ప్రయాగ్ రాజ్ మేయర్, మహా కుంభమేళా ప్రత్యేక ఈవో పర్యవేక్షించారు. రికార్డుకు సంబంధించిన తుది నివేదిక మూడు రోజుల్లో వెలువడనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా... 2019లో ప్రయగ్ రాజ్ లో జరిగిన కుంభమేళాలో 10వేల మంది పారిశుధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి 15వేల మంది పారిశుధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు!

Tags:    
  • KumbhMela2025 
  • Prayagraj 
  • GuinnessWorldRecord 
  • MahaKumbh 
  • SanitationDrive 
  • EnvironmentalStewardship 
  • TriveniSangam 
  • MahaShivratri 
  • Kumbhmela2025 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS