AIతో ప్రాణాలు కాపాడిన మహిళ.. డాక్టర్ల కంటే ముందే వ్యాధిని గుర్తించిన చాట్‌బాట్

పారిస్‌కు చెందిన మార్లీ గార్న్‌రైటర్ అనే మహిళ చాలా నెలలుగా రాత్రిపూట చెమటలు పట్టడం, చర్మం దురద, మంట వంటి సమస్యలతో బాధపడుతుంది.;

Update: 2025-04-27 19:30 GMT

ప్రస్తుతం టెక్నాలజీ ప్రతి రంగంలోనూ వేగంగా కలిసిపోతుంది. క్రమంగా ఇది ఇప్పుడు ఆరోగ్య రంగంలో కూడా సాయం చేస్తోంది. దీని ప్రభావం ప్రస్తుతం కనిపించడం మొదలైంది. ఫ్రాన్స్‌లో నివసిస్తున్న 27 ఏళ్ల మహిళ కథ దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఈ ఘటనలో ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ రక్త క్యాన్సర్ సూచనను డాక్టర్ల కంటే దాదాపు ఒక సంవత్సరం ముందే చెప్పింది. అసలు ఈ విషయం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. చాట్‌జీపీటీ మార్లీకి ఎలా సహాయం చేసింది. క్యాన్సర్‌ను ఎలా గుర్తించిందో చూద్దాం.

మార్లీకి ఏమి జరిగింది?

పారిస్‌కు చెందిన మార్లీ గార్న్‌రైటర్ అనే మహిళ చాలా నెలలుగా రాత్రిపూట చెమటలు పట్టడం, చర్మం దురద, మంట వంటి సమస్యలతో బాధపడుతుంది. తన తండ్రి క్యాన్సర్‌తో మరణించిన తర్వాత తనకు ఒత్తిడి ఉండవచ్చని ఆమె భావించింది. ఆమె వైద్య పరీక్షలు కూడా చేయించుకుంది. కానీ టెస్టులు నార్మల్ గా వచ్చాయి.

కానీ ఆ మహిళ అయోమయంలో ఉంది. అందుకే ఆమె ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని తన లక్షణాల గురించి అడిగింది. చాట్‌జీపీటీ ఇది రక్త క్యాన్సర్ (హాడ్కిన్స్ లింఫోమా) లక్షణాలు కావచ్చని చెప్పింది. మొదట్లో ఆ మహిళ ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

కొన్ని నెలల తర్వాత మార్లీకి ఎక్కువ అలసట, ఛాతీ నొప్పి రావడం మొదలైంది. మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకుంది. కానీ ఈసారి నివేదికలో ఆమె ఊపిరితిత్తులలో ఒక పెద్ద గడ్డ బయటపడింది. పరీక్షల తర్వాత ఆమెకు హాడ్కిన్స్ లింఫోమా ఉందని తేలింది. ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్, ఇది తెల్ల రక్త కణాలపై ప్రభావం చూపుతుంది.

ఏదైనా ఏఐ సాధనం తనంత పెద్ద వ్యాధి గురించి ముందుగా చెప్పగలదని తాను ఊహించలేదని ఆ మహిళ చెప్పింది. అయితే చాట్‌జీపీటీ లేదా మరే ఇతర ఏఐ వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. కానీ భవిష్యత్తులో ఈ సాధనాలు ప్రారంభ లక్షనాలను గుర్తించడంతో సాయపడతాయని ఈ కేసు సూచిస్తుంది. ఏఐ ప్రస్తుతం డాక్టర్ల ముందు గెలవలేదు. కానీ అనేక సందర్భాల్లో డాక్టర్లకు సహాయకారిగా ఉంటుంది. ఇకమీదట డాక్టర్లకు కూడా ఏదైనా వ్యాధిని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.

Tags:    

Similar News