అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన బాబు

దీని మీద నంద్యాలలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు.

Update: 2024-05-11 13:09 GMT

అత్యంత కీలకమైన సమయంలో అల్లు అర్జున్ జనసేనకు అతి పెద్ద ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ తరఫున ఒక ఎమ్మెల్యే అభ్యర్ధి ఇంటికి వెళ్లడం అక్కడ ప్రజలకు అభివాదాలు చేస్తూ వైసీపీ వారితో నవ్వులు చిందించడంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి అనుకూలంగా వ్యతిరేకంగా చర్చ సాగుతోంది.

దీని మీద నంద్యాలలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వస్తే దానికి కూడా రాజకీయం చేస్తూ వైసీపీ నేతలు సైకోలుగా మారిపోతున్నారు అని అన్నారు. కేవలం తన స్నేహితుడిని కలవడానికి మాత్రమే అల్లు అర్జున్ వచ్చారని చంద్రబాబు అన్నారు.

అలా స్నేహ ధర్మం మీద అల్లు అర్జున్ వస్తే దానికి వైసీపీ సైకోలు జనసేన తమకు మద్దతుగా ఉందని చెబుతూ నంద్యాలలో హడావుడి చేయడం పట్ల చంద్రబాబు మండిపడ్డారు. అసలు జనసేన అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ ఉన్నారని టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఉందని, అయినా సరే నీచమైన రాజకీయాలు చేస్తున్నారు అంటూ చంద్రబాబు ఒక లెవెల్ లో మండిపడ్డారు.

ఈ సందర్భంగా వైసీపీ నేతల తీరుని చీల్చి చెండాడారు. వైసీపీకి జనసేన మద్దతు ఇచ్చినట్లుగా కలరింగ్ ఇస్తూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు ఇది మంచి విధానం కాదని అన్నారు. . ఇది చీకటి రాజకీయం, నీచమైన రాజకీయం అని ఆయన మండిపడ్డారు. తాడేపల్లి గూడెంలో పెద్ద సైకో ఉన్నారని నంద్యాలలో చిన్న సైకో ఉన్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

Read more!

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఏపీలో ఎన్నికలు ఫుల్ హీట్ గా ఉన్న వేళ నంద్యాల వచ్చారు. నంద్యాల నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శిల్పా రవి కిశోర్ రెడ్డి ఇంటికి శనివారం వచ్చారు. ఇది ఒక విధంగా టీడీపీకి జనసేనకు అతి పెద్ద షాక్ గా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

అదే టైం లో మెగా ఫ్యామిలీ అంతా ఆయనకు మద్దతుగా నిలుస్తోంది. అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తున్నట్లుగా ఒక ట్వీట్ చేశారు. కానీ ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి మరీ శిల్పాన కలవడంతో ఇదేంటి పుష్పా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

Tags:    

Similar News