బీజేపీ డిమాండ్... బాబు గ్రీన్ సిగ్నల్...!?
ఏపీలో రాజకీయం మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో అధికార వైసీపీని గద్దె దించడానికి విపక్ష తెలుగుదేశం పార్టె కూటమి కడుతోంది;
ఏపీలో రాజకీయం మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో అధికార వైసీపీని గద్దె దించడానికి విపక్ష తెలుగుదేశం పార్టె కూటమి కడుతోంది. ఆ కూటమిలో జనసేన ఇప్పటికే చేరిపోగా బీజేపీ రావాల్సి ఉంది. బీజేపీ రాక కోసం టీడీపీ జనసేన ఎదురుచూస్తున్నాయని ప్రచారం ఉంది.
బీజేపీ అయితే ఇప్పటిదాకా బెట్టు చేస్తూ ఉంది. దానికి కారణం ఏపీలో మొత్తం పాతిక ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో గరిష్టంగా పది సీట్లను పొత్తులో తమకు ఇవ్వమని కోరుతోంది అని అంటున్నారు అసెంబ్లీ సీట్ల విషయంలో బీజేపీకి పెద్దగా పట్టింపులు లేవని కూడా అంటున్నారు.
దాంతోనే పొత్తుల పంచాయతీ సాగుతోంది అని అంటున్నారు. అయితే మొదట నాలుగు నుంచి ఆరు ఆ తరువాత ఎనిమిది ఎంపీల దాకా వెళ్ళిన టీడీపీ అధినాయకత్వం ఇపుడు బీజేపీ డిమాండ్ చేసినట్లుగా పదికి పది ఎంపీ సీట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది అని ప్రచారం సాగుతోంది. దాంతో పాటుగా బీజేపీ కోరిన చోట్ల కూడా ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ మొగ్గు చూపుతోందని అంటున్నారు.
దీంతోనే పొత్తుల కధ ముందుకు కదులుతోందని అంటున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరిని ఢిల్లీకి బీజేపీ పెద్దలు పిలిపించారు. ఆమెతో ఏపీలో రాజకీయాలు బీజేపీ నేతల అభిప్రాయాలు పొత్తుల అంశం చర్చించిన తరువాత చంద్రబాబుతో కూడా మాట్లాడుతారు అని అంటున్నారు.
ఇక ఈ వారంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఢిల్లీ వెళ్తారు అని అంటున్నారు. బీజేపీ పెద్దలతో భేటీ జరుగుతుందని ఆ మీదట పొత్తుల అంశం ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు. ఎన్నికల ప్రకటన వచ్చే వారం లో ఉంటుంది అని అంటున్నారు. అప్ప్పటికి మొత్తానికి మొత్తం మూడు పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించి ప్రచార రంగంలోకి దూకాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో మూడు పార్టీలు 2014లో కలిసాయి. అధికారంలోకి వచ్చాయి. ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని టీడీపీ భావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఏపీ లో అసెంబ్లీ సీట్ల మీద ఫోకస్ పెట్టడం లేదు. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలన్న దాని మీదనే చూస్తోంది.
అందుకే ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకుంటోంది అని అంటున్నారు. రేపటి రోజున ముత్రులు ఎలాంటి పొలిటికల్ స్టెప్స్ తీసుకున్నా కూడా తాము మాత్రం సేఫ్ జోన్ లో ఉండేలా ఏపీలో ఎక్కువ ఎంపీలను గెలిపించుకుంటే కమలం పార్టీకి స్టేట్ లో కూడా రాజకీయ విలువ పెరుగుతుందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
మొత్తం మీద చూసుకుంటే బీజేపీ నెల రోజుల పాటు బెట్టు చేసి ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. అంతే కాదు బీజేపీ ఎక్కడ నిలబడుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. మరి బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే టీడీపీ పరిస్థితి ఏంటి అంటే ఏపీలో అధికారం దక్కితే చాలు అన్నది ఆ పార్టీ విధానంగా ఉంది అని అంటున్నారు. అదే విధంగా జాతీయ రాజకీయాల మీద ఇప్పట్లో టీడీపీ ఫోకస్ చేసే ప్రశ్న ఉండకపోవచ్చు అని అంటున్నారు.