ప్రపంచ వినాశనానికి ఎన్ని అణు బాంబులు కావాలంటే ?

ఇక భూమి సర్వ నాశనం కావడానికి వందంటే వంద అణు బాంబులు చాలు అని అంటున్నారు నిపుణులు. అలా వంద అణు బాంబులు పడితే కనుక ఈ భూమి అన్నదే ఉండదు.;

Update: 2026-03-03 00:30 GMT

ఈ భూమి మీద పచ్చని ప్రకృతిని ఇచ్చాడు దేవుడు. అందరూ ఫలాలను అందుకుని ఫలితాలని పొందుతూ ఆనందంగా ఉండాలని దీవించాడు. కానీ 84 లక్షల జీవ రాశులలో తెలివైన జీవి మనిషి మాత్రం విధ్వంశం వైపుగానే అడుగులు వేస్తున్నాడు. ఎందుకంటే మనిషిని మెదడు ఉంది. ఆ మెదడుతో మంచి ఆలోచనలు చేయవచ్చు. కానీ స్వార్ధం నిండుగా ఉన్న మనిషి వినాశనం వైపుగా చూస్తున్నాడు. అందుకే యుద్ధాలు కోరుకుంటున్నాడు. దాని కోసం అణు బాంబులను నమ్ముకుంటున్నాడు. ప్రత్యర్ధి ప్రాంతం నశిస్తే తాను బాగుంటాను అనుకుంటున్నాడు, కానీ అణు బాంబు అలాంటిది కాదు వేసిన వాడినీ మట్టుపెట్టేస్తుంది.

భూమి భస్మీపటలం :

ఈ రోజున అనేక దేశాల వద్ద అణు బాంబులు ఉన్నాయి. వాటి మొత్తం సంఖ్య ఏకంగా 12 వేలు అని ఒక అంచనా ఉంది. రష్యా వద్ద 5459 అణు బాంబులు ఉంటే అమెరికా వద్ద 5277, చైనా వద్ద 600, ఫ్రాన్స్ వద్ద 290, యూకే వద్ద 225, భారత్ వద్ద 180, పాకిస్థాన్ వద్ద 170, ఇజ్రాయెల్ వద్ద 91, ఉత్తర కొరియా వద్ద 50 ఉన్నట్లుగా ఒక అంచనా. ఇలా వేలాదిగా ఉన్న అణు బాంబులు ప్రపంచానికి ఎంతో ప్రమాదం అని అంటున్నారు.

వంద చాలుట :

ఇక భూమి సర్వ నాశనం కావడానికి వందంటే వంద అణు బాంబులు చాలు అని అంటున్నారు నిపుణులు. అలా వంద అణు బాంబులు పడితే కనుక ఈ భూమి అన్నదే ఉండదు. మరి 12 వేల అణు బాంబులు అంటే సౌర వ్యవస్థలో సగానికి సగం భస్మీపటలం అయిపోతుంది అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అణు బాంబుల నిల్వలు ఎంత డేంజర్ అన్నది అర్ధం అవుతోంది కదా. కానీ రక్షణ పేరుతో ఏ దేశానికి ఆ దేశం పోగు చేసుకుంటోంది. ఈ రోజు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి కారణం అణు ఆయుధాలు ఆ దేశం తయారు చేస్తోంది అన్న అనుమానంతోనే అని అంటున్నారు.

అణు యుద్ధం జరిగితే :

ప్రస్తుతం ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ కలసి చేస్తున్న యుద్ధం భీకర రూపం దాలుస్తోంది. అయితే ఈ యుద్ధంలో కనుక మరో కొత్త రూపం తీసుకుంటే అపుడు సంగతేంటి అన్న చర్చ సాగుతోంది. అణు బాంబులతో కనుక యుద్ధమే జరిగితే ఈ భూమి అన్నదే ఉండదని అంటున్నారు. భూమి మీద వంద అణు బాంబులు పడితే చాలు కోట్లలోనే జనాలు మరణిస్తారు అని నిపుణులు చెబుతున్నారు.

పదేళ్ల పాటు పొగ :

అణు బాంబుల పేలుడు వల్ల ఉత్పన్నం అయ్యే పొగ ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఏకంగా పదేళ్ళ పాటు అది ఉన్న చోటనే దట్టంగా నిలిచిపోతుంది అని అంటున్నారు. ఆ పొగ ప్రభావంతో ఈ భూమి మీద సూర్య కాంతి అసలు పడకుండా గాఢంగా కమ్ముకుంటుంది అని చెబుతున్నారు. దాంతో సూర్య కాంతి లేకపోతే భూమి మీద జీవరాశులు గతి తప్పుతాయి మొత్తానికి మొత్తం భూమి వాతావరణం కూల్ అయిపోతుంది. మైనస్ డిగ్రీలకు వాతావరణం పరిస్థితి చేరుకుంటుంది. ఇలాంటి వాతావరణంలో పంటలు పండవని చెబుతున్నారు.

ఏ పరిణామాలకు దారి తీస్తాయో :

అంతే కాదు అణు బాంబుల వల్ల గాలి నీరు అన్నీ పూర్తిగా కలుషితం అవుతాయి అని అంటున్నారు ఇక బతికి ఉన్న కొంత మంది ప్రజలు కూడా ఈ వాయు కాలుష్యం మూలంగా అలాగే ఆహారం లేకపోవడం వల్ల కొంతకాలానికే మరణిస్తారు అని అంటున్నారు అలా మొత్తంగా భూమి ఉండదు, మనిషి కూడా ఉండడని అంటున్నారు మరి ఈ విధంగా అణు బాంబుల ప్రభావం ఉంటే ఈ రోజున భీకర యుద్ధాలు దేశాల మీద దేశాలు సమరం చేయడాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News