'సలార్ సక్సెస్'.. పవన్ ని కరెక్ట్ గా వాడుకున్న సీబీఎన్!
ప్రస్తుతం సినిమావాళ్ల కంటే రాజకీయ నాయకులపైనే ట్రోలింగ్ ఎక్కువగా నడుస్తున్నాయనే చర్చ మొదలైంది;
ప్రస్తుతం సినిమావాళ్ల కంటే రాజకీయ నాయకులపైనే ట్రోలింగ్ ఎక్కువగా నడుస్తున్నాయనే చర్చ మొదలైంది. మొదట్లో సినిమా యాక్టర్ ల సినిమాలు హిట్టు, ఫట్టు లపై సాధారణంగా ట్రోల్స్ నడిచేవి. ఇప్పుడు ప్రధానంగా రాజకీయ నాయకులే లక్ష్యంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇటు సినిమాలకు, అటు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తుల సంగతైతే చెప్పే పనిలేదు. ప్రస్తుతం పవన్ ఆ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు! ఈ సమయంలో సలార్ సక్సెస్ పవన్ ట్రోలింగ్ కి వచ్చి పడింది!
అవును... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో.. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం "సలార్". ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ కలెక్షన్స్ తో నడుస్తుంది ! థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కరెక్ట్ గా ఉపయోగించుకున్నాడని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
ఈ సినిమాకు సంబంధించి వచ్చిన మెజారిటీ రివ్యూల బాటం లైన్... "యాక్షన్ అన్ లిమిటెడ్" అని ఉండటం... ఇది ఏ స్థాయిలో యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఈ సమయంలో ప్రభాస్ తో పలువురు టాప్ స్టార్ హీరోలను ఏ దర్శకుడు ఎలా ఉపయోగించుకున్నారంటే... అంటూ ఒక చర్చ నెట్టింట మొదలైంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి పవన్ పాలిటిక్స్ వైపు మళ్లింది. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.
ఇందులో భాగంగా...
ప్రభాస్ ను కరెక్ట్ గా వాడుకుంది ఎస్.ఎస్. రాజమౌళి, ప్రశాంత్ నీల్
జూ ఎన్టీఆర్ ను సరిగ్గా ఉపయోగించుకుంది వీవీ వినాయక్, రాజమౌళి
అల్లు అర్జున్ ను సూపర్ గా వాడుకుంది సుకుమార్, త్రివిక్రం
మహేష్ బాబును సరిగ్గా ఉపయోగించుకుంది పూరీ జగన్నాథ్
పవన్ కల్యాణ్ ను ఒక రేంజ్ లో వాడుకుంది చంద్రబాబు నాయుడు!
అంటూ ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఅర్, అల్లు అర్జున్, మహేష్ బాబులను ఆయా సంచలన దర్శకులు సినిమాల కోసం సరిగ్గా ఉపయోగించుకుంటే... పవన్ కల్యాణ్ ను మాత్రం సరిగ్గా వాడుకున్నది చంద్రబాబు నాయుడు అని ఆ పోస్ట్ లో పేర్కొనడం సంచలనంగా మారింది. ఇదే సమయంలో ఈ పోస్ట్ ను ఆర్జీవీ కూడా షేర్ చేశారు. దీంతో ఇక ఈ పోస్ట్ నెట్టింట చిన్న సైజు యుద్ధానికి దారి తీసింది! మెజారిటీ ప్రజలు... “కరెక్ట్” అని కామెంట్ చేస్తుండటం గమనార్హం!