మమత గారూ ఆవేశం వద్దు.. సర్‌ను కొనసాగించండి: సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ``మమత గారూ ఆవేశం వద్దు.;
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ``మమత గారూ ఆవేశం వద్దు. ఎన్నికల సంఘం చేపట్టిన సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను కొనసాగించనివ్వండి. దీనికి అడ్డు పడొద్దు. ఎన్నికల సం ఘానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించండి.`` అని వ్యాఖ్యానించింది. ఇటీవల మమతా బెనర్జీ.. స్వయంగా నల్లకోటు ధరించి సుప్రీంకోర్టులో సర్ ప్రక్రియపై వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు పిటిషన్ పై సోమవారు సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం వాదనలు కూడా విని.. కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల ప్రక్రియ, ఓటరు అంశాలలో ఎవరూ వేలు పెట్టడానికి వీల్లేదని పేర్కొంది. ఏదైనా ఉంటే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావా లని ఎవరూ.. దీనిని సరిగా అర్ధం చేసుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించింది. రాష్ట్రాలు మూకుమ్మడిగా సర్‌ను ఎందుకు వ్యతిరే కిస్తున్నాయో అర్ధం కావడం లేదన్న సుప్రీంకోర్టు.. ఇది దేశానికి అత్యంత కీలకమైన వ్యవహారంగా పేర్కొంది. దశాబ్దాలుగా ఓటర్ల రివిజన్ చేపట్టకపోతే.. నకిలీ ఓట్ల తొలగింపు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. సర్ ప్రక్రియను కొనసాగించాలని తాము గతంనూ ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేసింది.
పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న సర్ ప్రక్రియ విషయంలో రాష్ట్రం సహకరించడం లేదన్న ఎన్నికల సంఘం వాదనలను పరిగ ణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. 300 మంది అధికారులను ఇవ్వాలని కోరితే.. కేవలం 80 మందినే కేటాయించడంపై అసహ నం వ్యక్తం చేసింది. అది కూడా.. గ్రేడ్-2 స్థాయి అధికారులను కేటాయించడంపై ప్రశ్నలు గుప్పించింది. ఇది సరికాదని.. మార్పు నకు అందరూ సహకరించాలని సూచించింది. ``సర్ ప్రక్రియలో అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేయవద్దు. ఇలా చేయడం అంటే.. ఎన్నికల సంఘాన్నికాదు.. ప్రజాస్వామ్యాన్నే అవమానించినట్టు.. అనుమానించినట్టు అవుతుంది`` అని మమత ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
మరో రెండు మాసాల్లోనే నోటిఫికేషన్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం రెడీ అయింది. మరో రెండు మాసాల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సర్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. నిన్న మొన్నటి వరకు ఉదయం 8గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6 గంటలకు ముగిసిన ప్రక్రియ తాజాగా ఉదయం 6 గంటలకే ప్రారంభమై.. భోజన విరామం కూడా తగ్గించుకుని సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతోంది. కాగా.. 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ.. తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఇదే.. పెను వివాదానికి దారితీస్తోంది.