స‌వాళ్ల నుంచి 'రాజీనామా'ల వ‌ర‌కు.. తెలంగాణ రాజ‌కీయం!

మంత్రి జూప‌ల్లి కృష్ణారావు చేసిన స‌వాల్‌కు ప్ర‌తిగా.. మాజీ మంత్రి హ‌రీష్‌రావు లేఖ రాశారు. బీఆర్ ఎస్ హ‌యాంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న అప్ప‌ట్లో ఎంత అప్పులు చేశారు.

Update: 2026-07-04 12:30 GMT

తెలంగాణ‌లో రాజ‌కీయాలు రోజుకో విధంగా మ‌లుపులు తిరుగుతున్నాయి. గురువారం రోజు రోజంతా స‌వాళ్ల రాజ‌కీయం న‌డి చింది. అధికార కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుల మ‌ధ్య ఈ స‌వాళ్లు దుమ్మురేపాయి. చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మం టూ ఇరు ప‌క్షాల్లోని నాయ‌కులు మాట‌ల మంట‌లు రేపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు ప‌క్షాల‌ను శాంతింప చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయినా.. ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలోనే హ‌రీష్‌రావును అరెస్టు చేసి త‌ర్వాత వ‌దిలి పెట్టారు. అయితే.. శుక్ర‌వారం నాటికి ఈ వ్య‌వ‌హారం యూట‌ర్న్ తీసుకుంది.

మంత్రి జూప‌ల్లి కృష్ణారావు చేసిన స‌వాల్‌కు ప్ర‌తిగా.. మాజీ మంత్రి హ‌రీష్‌రావు లేఖ రాశారు. బీఆర్ ఎస్ హ‌యాంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న అప్ప‌ట్లో ఎంత అప్పులు చేశారు.. అనే విష‌యాల‌ను వివ‌రించారు. త‌మ హ‌యాంలో 4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే అప్పులు చేశామ‌ని తెలిపారు. వాటిని కూడా అభివృద్ధి ప్రాజెక్టుల‌కే ఖ‌ర్చులు చేశామ‌న్నారు. కానీ, ప్ర‌స్తుత ప్ర‌భుత్వం వారు చేసిన అప్పుల‌ను కూడా త‌మ‌పై రుద్దుతున్నార‌ని ఆరోపించారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం 3.5 ల‌క్ష‌ల కోట్ల‌ను కేవ‌లం రెండున్న‌రేళ్ల‌లోనే తీసుకువ‌చ్చింద‌ని హ‌రీష్‌రావు ఆరోపించారు.

కాంగ్రెస్ హ‌యాంలో చేసిన అప్పుల‌ను కూడా త‌మ ఖాతాలో వేస్తున్నార‌ని ఆరోపించిన హ‌రీష్ రావు.. చ‌ర్చ‌ల‌కు రాకుండా త‌ప్పించుకున్న‌ప్పుడు స‌వాళ్లు చేయ‌డం ఎందుక‌ని జూప‌ల్లిని ప్ర‌శ్నించారు. ఇక‌, ఈ లేఖ‌పై జూప‌ల్లి స్పందిస్తూ.. తాను చెప్పిన విష‌యాలే నిజ‌మ‌ని వ్యాఖ్యానించారు. దీనిలో ఏమాత్రం ప‌స‌లేద‌ని అన్నారు. తాను చెప్పిన లెక్క‌ల‌కే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. ఒక‌వేళ త‌న లెక్క‌లు త‌ప్ప‌ని హ‌రీష్‌రావు ఆధారాల‌తో స‌హా నిరూపిస్తే.. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని తెలిపారు. ఈ విష‌యంలో మ‌రో మాటేలేద‌ని జూప‌ల్లి వివ‌రించారు.

త్యాగాల‌తో వ‌చ్చిన రాష్ట్రాన్ని సొంత లాభానికి వాడుకున్న చ‌రిత్ర బీఆర్ ఎస్ నేత‌ల సొంత‌మ‌ని జూప‌ల్లి విమ‌ర్శించారు. బీఆర్ ఎస్ హ‌యాంలో 8 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కుపైగానే అప్పులు చేశార‌ని మ‌రోసారి చెప్పారు. ఈలెక్క‌లు త‌ప్ప‌యితే.. మాజీ సీఎం కేసీఆర్‌తోనే ఆ విష‌యాన్ని చెప్పించాల‌ని అన్నారు. రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల సొమ్మును కూడా దోచుకున్నార‌ని ఆరోపించారు. హ‌రీష్ రావు స‌వాల్ చేయ‌డ‌మే త‌ప్ప‌.. దానికి క‌ట్టుబ‌డి ఉండే మ‌నిషి కాద‌ని అన్నారు. బీఆర్ ఎస్ పాల‌న‌లో రాష్ట్రం అప్పుల పాలైంద‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నాన‌ని.. కాద‌ని నిరూపిస్తే.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ రువ్వారు.

Tags:    

Similar News