తిరుపతి లడ్డూ ఇష్యూ- అమిత్ షాకి బ్రీఫింగ్ ?

కేంద్ర హోం మంత్రిగా అత్యంత శక్తివంతమైన ప్రభుత్వ అధినేతగా అమిత్ షా జాతీయ స్థాయిలో కనిపిస్తారు.;

Update: 2026-02-09 17:39 GMT

కేంద్ర హోం మంత్రిగా అత్యంత శక్తివంతమైన ప్రభుత్వ అధినేతగా అమిత్ షా జాతీయ స్థాయిలో కనిపిస్తారు. ఆయన బీజేపీకి కానీ ఎన్డీయే ప్రభుత్వానికి కానీ పవర్ ఫుల్ లీడర్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అటు పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వం పరంగా కానీ ఆయన కనుసన్నలలోనే అంతా జరుగుతుందని ప్రచారంలో ఉన్న మాట. ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి పొద్దు పోయాక ఏపీ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. బాబుకు ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీలు అంతా ఘన స్వాగతం పలికారు. అనంతరం బాబు ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించి పార్లమెంట్ బడ్జెట్ సెషన్ గురించి ఇతర విషయాల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన వన్ జన్ పథ్ లోని తన నివాసానికి చేరుకున్నారు.

అమిత్ షాతో చర్చించేది ఇదే :

ఇక బాబు మంగళవారం కేంద్ర మంత్రి అమిత్ షాను కలవబోతున్నారు. ఆయనతో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు తిరుపతి లడ్డూ ఇష్యూని కూడా వివరిస్తారు అని అంటున్నారు. సీబీఐ ఆధ్వర్యంలో వచ్చిన రిపోర్టు గురించి చర్చిస్తారు అని అంటున్నారు. ఏపీలో వర్తమాన రాజకీయ పరిణామాలను గురించి ఆయన వివరిస్తారు అని అంటున్నారు. ఏపీలో లడ్డూ ఇష్యూలో చోటు చేసుకున్న పరిణామాలు వాటి పర్యవసానాలు కేంద్ర హోం మంత్రి దృష్టిలో పెడతారు అని అంటున్నారు.

కేంద్రం ఫోకస్ ఉంటుందా :

సీబీఐ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. ఇక సీబీఐని తిరుపతి లడ్డూ విషయంలో విచారణకు నియమించింది సుప్రీం కోర్టు. నివేదిక ఇచ్చారు. దాంతో కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమి చేస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది. మరో వైపు రాజకీయంగా చూస్తే టీడీపీ బీజేపీ జనసేన మిత్రులుగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ మూడు పార్టీలకు ప్రత్యర్థిగా రాజకీయంగా వైసీపీ ఉంది. దాంతో ఏపీలో మూడు పార్టీలను సమాయత్తపరచి వైసీపీ మీద విమర్శలు ఎక్కుపెట్టేలా టీడీపీ వ్యూహరచన చేసింది. అదే సమయంలో వీలైనంతగా కేంద్ర సాయం కూడా కావాలని అక్కడ బీజేపీ పెద్దలు కూడా సహకరిస్తే లడ్డూ ఇష్యూలో వైసీపీ చేసిన తప్పులను మరింతగా ఎక్స్ పోజ్ చేయవచ్చు అన్నది టీడీపీ ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

సానుకూలమేనా :

ఇక ఏపీలో టీడీపీకి అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తున్న కేంద్ర బీజేపీ పెద్దలు ఈ ఇష్యూలో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు అవసరమైన సలహా సూచనలు ఇస్తారని కూడా అంటున్నారు. అదే సమయంలో ఏపీలో వైసీపీని బలంగా ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహరచనకు ఏపీ బీజేపీ నేతలతో ముందుకు సాగేందుకు తగిన విధంగా దిశా నిర్దేశం చేయవచ్చు అన్న ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News